సమంత కొత్త చిత్రం టైటిల్ వింతగా ఉందే

ఇన్నాళ్లు సమంతను వెండి తెర మీద వివిధ పాత్రల్లో గ్లామర్ గా చూసిన ప్రేక్షకులు ఇంకొద్ది రోజుల్లో విభిన్నంగా చూడనున్నారు. సమంత రీసెంట్ స్టార్ట్ చేసిన ప్రాజెక్టుల్లో కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’ రీమేక్ కూడ ఒకటి. ఇందులో సమంత 70 ఏళ్ల భామగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సురేష్ బాబు నిర్మించనున్నారు. దర్శకురాలు నందిని రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనుంది. ఇక ఈ చిత్రానికి టైటిల్ ఏం పెట్టనున్నారనేది హాట్ టాపిక్ గా సినీ సర్కిల్స్ లో మారింది.

ఆ టైటిల్ మరేదో కాదు..”ఓ ..బేబి”. ‘ట్యాగ్ లైన్ …ఎంత సక్కగున్నావే. రంగస్దలం చిత్రంలో లచ్చిమి ఎంత సక్కగున్నావే పాటలో లైన్ నుంచి ఈ టైటిల్ తీసుకున్నట్లు అర్దమవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

2014 లో విడుదలైన ఈ చిత్ర కథ విషయానికొస్తే.. 70 ఏళ్ల ఓ బామ్మకు తాను వయసులో ఉన్నప్పుడు అచ్చంగా తనలాగే ఉన్న20 ఏళ్ల యువతి కనపడుతుంది. ఆ అమ్మాయిని చూసి బామ్మ షాకవుతుంది. ఆ తరువాత ఏంజరుగుతుందన్నదే సినిమా కథ. సో.. బామ్మ పాత్రను సమంత పోషించనున్నట్లు టాక్.