రీసెంట్ గా తను డైరక్ట్ చేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమాతో వర్మకు ఓ వర్గం మీడియా పూర్తిగా వ్యతిరేకం అయ్యింది. అందులో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా సినిమా తీయటంతో చాలా మంది శత్రువులు తయారయ్యారు. ఆయనపై ఇప్పుడు రకరకాల రూమర్స్ తమ చేతిలో ఉన్న మీడియాతో స్ప్రెడ్ చేస్తున్నారు. తాజాగా ఆయన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తెరవెనక బాగా సంపాదించాడంటూ న్యూస్ ప్రచారం చేస్తున్నారు.
వారు చెప్పేదాని ప్రకారం..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో వర్మ జాతకం కొద్దిగా మారింది. ఈ సినిమా మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అవి కూడా పార్టీ పరంగానే తప్ప ప్రేక్షకుల పరంగా కాకపోవడంతో ఈ సినిమాకి కలెక్షన్లు ఓ మోస్తరుగా ఉన్నాయి. అదే కాకుండా ఈ సినిమా పేరుతో వర్మ తెర వెనుక బాగా సంపాదించాడన్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్‌లో బాగా వినిపిస్తోంది. అంటూ వారు చెప్పకనే వర్మ ఈ సినిమాతో బాగా సంపాదించాడంటూ ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ వార్త ని మిగతా వాళ్లు తమదైన శైలిలో ముందుకు తీసుకెళ్తారనటంలో సందేహం లేదు.
ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండు వారాల కిందే తెలంగాణలో విడుదలైంది. అక్కడ ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నిర్మాతలకు లాభాలు కూడా బాగానే వచ్చాయని సమాచారం. ఎన్నికల కారణంగా ఏపీలో మాత్రం సినిమా విడుదల కాలేదు. తెలుగుదేశం పార్టీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నించింది. అందులో విజయం కూడా సాధించింది. చివరికి కోర్ట్ కూడా వాళ్లకే సపోర్టుగా ఉండటంతో ఏపీ ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని ఎన్నికలకు ముందు చూసే భాగ్యం కలగలేదు.