రష్మిక ఇచ్చిన ట్విస్ట్ కు ఆ హీరోకు నోట మాట లేదు

లాస్ట్ ఇయిర్ గీతా గోవిందం సూపర్ హిట్ తో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది రష్మిక మందన్న. ఆమె తర్వాత చేసిన దేవదాసు చిత్రం ఫెయిలైంది. అయితే, మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక కావటంతో మరోసారి అంతటా చర్చనీయాంశంగా మారింది. కొందరు ఆమె లక్ అంటూంటే మరికొందరు ఆమె టాలెంట్ అని మెచ్చుకుంటున్నారు. అయితే మహేష్ సినిమా ఒప్పుకోవటం కోసం ఆమె ఓ హీరోకు ట్విస్ట్ ఇచ్చిందని తెలుస్తోంది.

సరిలేరు నీకెవ్వరు చిత్రం ఒప్పుకునే ముందు రష్మిక మందన్న తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమా కమిటైంది. ఆ సినిమాకు డేట్స్ కేటాయించి చెప్పాల్సిన సమయంలో ఆమెకు మహేష్ నుంచి ఆఫర్ వచ్చింది. అయితే మొదట ఆమె శివకార్తికేయన్ సినిమాకే మొగ్గు చూపింది. అయితే మహేష్ సినిమాలో ఆమె వేషం చిన్నది కావటం,, డేట్స్ తక్కువ రెమ్యునేషన్ ఎక్కువ కావటం, మహేష్ సినిమా అంటే భారీగా రిలీజ్ అవుతుందని దాంతో తన మార్కెట్ కు ప్లస్ అవుతుందని భావించింది.

ఇలా ఆలోచించిన ఆమె శివకార్తికేయన్ చిత్రానికి నో చెప్పి, అనీల్ రావిపూడి తను సినిమా చేస్తున్నానంటూ కబురు పంపిందని సమాచారం. ఈ ఊహించని ట్విస్ట్ కు శివకార్తికేయన్ షాక్ అయ్యారట. మరీ ఇంత నిర్ధాక్ష్యంగా కట్ చేస్తుందని ఊహించలేదని వాపోయాడట. ఏదైమైనా ఈ కాలం హీరోయిన్స్ స్పీడే వారు.

‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీఎంబీ (జి మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్), ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర నిర్మాతలు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.