షాకింగ్ : ‘జెర్సీ’ లో ఆఫర్, వదులుకున్న రాజ్ తరుణ్

నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. కలెక్షన్స్ వైజ్ గా ట్రేడ్ లో రికార్డ్ లుక్రియేట్ చేస్తోంది. భాక్సాపీస్ రికార్డ్ లు బ్రద్దలు కొడుతూ 50 కోట్ల దిశగా దూసుకుపోతోంది . డివైడ్ టాక్ లేకుండా యునానిమస్ గా హిట్ టాక్ తో దూసుకుపోతున్న జెర్సీ లో ఓపాత్రకు గానూ రాజ్ తరుణ్ కు ఓ ఆఫర్ వచ్చింది.

ఆ పాత్ర మరేదో కాదు..నాని కొడుకుగా.. .అయితే కేవలం నాలుగే సీన్స్ ఉన్నాయని వద్దన్నాడట. అయితే సినిమాలో ఆ నాలుగు సీన్స్ కీలకం గుర్తించలేదు అంటున్నారు. చేసి ఉంటే బ్లాక్ బస్టర్ సినిమాలో రాజ్ తరుణ్ ఉండేవాడుగా అంటున్నారు. అయితే రాజ్ తరుణ్ ఆలోచించింది వేరే విధంగా అని తెలుస్తోంది.

ఇలాంటి పాత్రలు చేస్తే తన కెరీర్ కు దెబ్బ అని, ఇక నుంచి అన్నీ గెస్ట్ రోల్స్ కే అడుగుతారని భావించాడట. తనను కూడా తనీష్, నవదీప్ లుగా భావించి, హీరో గా చూడరని అలా అయితే తన కెరీర్ ముగిసిపోయినట్లే అనుకున్నాడట. దాంతో జెర్సీని రిజెక్ట్ చేసాండంటున్నారు. ఇక జెర్సీ చిత్రానికి ప్రస్తుతానికి పోటీ చిత్రం ఏది లేదు.

అలాగే మే 9 న వచ్చే మహేష్ బాబు సినిమానే పోటీ అయితే ఈలోగా తన టార్గెట్ రీచ్ అయ్యి బిజినెస్ ని క్లోజ్ చేస్తాడు నాని . గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించగా కన్నడ భామ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది .