‘డ్రంక్ అండ్ డ్రైవ్’ లో పూజా హెగ్డే,అసలు నిజం ఇదీ

మహర్షి ప్రీ రిలీజ్ తరువాత పూజా హెగ్డే కారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కినట్టు మీడియాలో వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. దాంతో పూజ హెడ్గేనే తాగి ..డ్రైవ్ చేసి దొరికిపోయినట్లు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ రచ్చ రచ్చ కూడా చేసాయి. అయితే అందులో నిజం సగమే ఉంది. వాస్తవానికి పూజ హెడ్గే కారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికింది కానీ ఆ కారు నడుపుతున్నది మాత్రం ఆమె మేనేజర్. అతను తాగి ఉన్నాడని తెలుస్తోంది.

నిన్న ఆ ఈవెంట్ తర్వాత పూజా తన మేనేజర్ ఇతర స్నేహితులతో కలిసి కారులో ఆఫ్టర్ పార్టీ కోసం ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు బయలుదేరింది. అప్పటికే మేనేజర్ కాస్త డ్రింక్ చేసి ఉన్నాడట. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా హైదరాబాద్ పోలీసులు జరిపిన చెకింగ్ లో అతడు దొరికిపోయాడు.

ఆ సమయంలో పూజా హెగ్డే అదే కారులో వెనుక సీట్ లో ఉందట. దీంతో ఫోన్ ద్వారా వేరే వెహికల్ తెప్పించుకుని అక్కడ నుంచి బ్యాచ్ మొత్తం వెళ్లిపోయినట్లు సమాచారం. మేనేజర్ తన డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు కారుకు సంబంధించిన కాగితాలు ఇవ్వాల్సి వచ్చింది

దాంతో పూజా హెగ్డే నిజంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిందని వార్తలు బయిలుదేరాయన్నమాట. అరవింద సమేత వీర రాఘవ సక్సెస్ తర్వాత మరో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న పూజా హెగ్డేకు మహర్షి మీద ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.