తన సినిమా గాసిప్స్ అందరికీ కుండ బద్దలు కొట్టే క్లారిటీ ఇచ్చిన పవర్ స్టార్.!

Bhavadeeyudu Bhagat Singh

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు భారీ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమా తర్వాత మళ్ళీ తన భారీ హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో “భవదీయుడు భగత్ సింగ్” సినిమాని చేస్తున్నాడు.

అయితే ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చిన ఈ సినిమాపై గత కొన్నాళ్ల నుంచి పలు ఊహించని వార్తలే బయటకి వచ్చాయి. సినిమా ఆగిపోయింది అని పవన్ ఇక ఆసక్తిగా లేదని అనేక గాసిప్స్ సినిమాపై వినిపించగా దీనిపై అయితే చిత్ర బృందం ఏకంగా పవర్ స్టార్ మరియు దర్శకుడు హరీష్ లతోనే చెప్పించి బిగ్ క్లారిటీ ఇచ్చారు.

నిన్న నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అంటే సుందరానికి ప్రీ రిలీజ్ లో పవన్ మాట్లాడుతూ ఇదే బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ లో మా భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఉందని, త్వరలోనే స్టార్ట్ చేస్తామని కుండ బద్దలుకొట్టినట్టు పవన్ అదిరే క్లారిటీ ఇచ్చాడు.

దీనితో ఈ సినిమాపై వస్తున్న రూమర్స్, గాసిప్పులు అన్నిటికి ఒక సెన్సేషనల్ క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాలో పూజ హెగ్డే ఫిక్స్ అయ్యింది కానీ ఆమె తప్పుకున్నట్టు వార్తలొచ్చాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.