‘గీత గోవిందం’డైరక్టర్ తో మహేష్ ఓకే,బట్ వన్ కండీషన్

‘గీత గోవిందం’చిత్రం ఘన విజయంతో స్టార్ డైరక్టర్ స్దాయికి ఎదిగాడు దర్శకుడు పరుశురామ్. దాంతో ఆయన తన తదుపరి చిత్రాన్ని స్టార్ హీరోలతో చెయ్యాలనే ఫిక్స్ అయ్యారు. చేస్తే అల్లు అర్జున్ కానీ, మహేష్ తో కానీ చెయ్యాలనుకున్నారు. అందుకు తగ్గట్లుగా స్క్రిప్టు రెడీ చేసుకుని తనని గైడ్ చేస్తున్న అల్లు అరవింద్ సాయింతో ముందుకు వెళ్తున్నారు.

అల్లు అర్జున్ తో సినిమా అంటే చాలా టైమ్ పట్టేటట్లు ఉందని భావించిన అల్లు అరవింద్ …మహేష్ తో ముందుకు వెళ్తే బెస్ట్ అని భావించారు. ఆ విధంగా తన క్యాంప్ డైరక్టర్ కు సినిమా ఆఫర్ ఇచ్చినట్లు ఉంటుంది…తన బ్యానర్ లో మహేష్ తో సినిమా చేసినట్లు ఉంటుందని భావించారు. అందుకు తగినట్లుగా నమ్రతను కలిసి ప్రాజెక్టును ఫైనల్ చేయటానికి చాలా రోజుల క్రితమే ట్రైల్స్ మొదలెట్టారు.

అందులో భాగంగా రీసెంట్ గా పరుశు రామ్ వెళ్లి మహేష్ కి ఒక లైన్ చెప్పినట్లు తెలుస్తోంది. లైన్ ఇంట్రస్టింగ్ గా ఉండటంతో మహేష్ కూడా ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరుశురామ్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్ చేయాలంటే తన డేట్స్ దిల్ రాజు దగ్గర ఉన్నాయని, ఆయనతో కలిసి చేసుకోమని చెప్పారట. ఆ కండీషన్ ఓకే అంటేనే ఈ సినిమా ముందుకు వెళ్తుందని తెలుస్తోంది. దీనికి అల్లు అరవింద్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ప్రస్తుతం మహర్షి సక్సెస్‌ ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు జూలై నుండి అనిల్ రావిపూడి సినిమాతో బిజీ కానున్నాడు.