హిట్ కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్న సమంత

సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ బాగా ఎక్కువే. ఓ సారి ఓ సినిమా హిట్ అయ్యిందంటే అందులో కథ,కథనం, నటీనటులు అన్నిటితో పాటు ఆ సినిమాకు సంభందించిన విషయాలను సెంటిమెంట్స్ గా భావించి రిపీట్ చేస్తూంటారు. ఇప్పుడు సమంత కూడా అదే రూటులో ప్రయాణం పెట్టుకుంది. సెంటిమెంట్ ని ఫాలోఅవుతోంది. తన భర్త నాగచైతన్యతో చేసిన మజిలి రిలీజ్ సమయంలో తిరుపతి వెళ్లింది. ఆ సినిమా సూపర్ హిట్టైంది. ఇప్పుడు మరోసారి తన సినిమా ఓహ్ బేబి రిలీజ్ కు వచ్చింది. ఈ సమయంలో ఆమె మరో సారి ఓహ్ బేబి టీమ్ తో కలిసి తిరుపతి వెళ్లింది. దాంతో మరోసారి ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి హిట్ అవుతుందని భావిస్తోంది.

సమంత అక్కినేని, నందినీ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం `ఓ బేబి` . సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ వారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో సమంతతో పాటు సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూడా కీల‌క పాత్ర‌లో న‌టించారు.

ఈ చిత్రంలో ల‌క్ష్మి, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సాంకేతిక వ‌ర్గం: మ్యూజిక్‌: మిక్కి జె.మేయ‌ర్‌, కెమెరా: రిచ‌ర్డ్ ప్ర‌సాద్ , డైలాగ్స్‌: ల‌క్ష్మీ భూపాల్‌, ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధిఖీ, ప్రొడ‌క్ష‌న్ , డిజైన్‌:జ‌య‌శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌, నిర్మాత‌లు: సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, హ్యువు థామ‌స్ కిమ్ ,ఆర్ట్‌: విఠ‌ల్‌.కె, ద‌ర్శ‌క‌త్వం: బి.వి.నందినీ రెడ్డి, నిర్మాణ సంస్థ‌లు: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్రాస్ పిక్చ‌ర్స్‌, స‌హ నిర్మాత‌లు: విజ‌య్ దొంకాడ‌, దివ్యా విజ‌య్‌.