`ఓ బేబి`: సమంత రెమ్యునేషన్,బడ్జెట్ లెక్కలు

ఈ వారంలో ఓ బేబి రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు. అదే సమయంలో ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ గురించి, సమంత తీసుకునే రెమ్యునేషన్ గురించి ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. చాలా మంది సురేష్ ప్రొడక్షన్స్ కదా..సురేష్ బాబు మేనల్లుడు భార్య కదా రెమ్యునేషన్ విషయంలో పెద్దగా పట్టుపట్టలేదని, నామ మాత్రంగా తీసుకుంటోందని వార్తలు వచ్చాయి.

అయితే సురేష్ బాబు ..దేని గొడవ దానిదే అన్నట్లు సమంత తనకు చుట్టమైనా ..రెమ్యునేషన్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని, బాగానే ఇచ్చారని తెలుస్తోంది. మరి సమంత కు ఎంత ఇచ్చి ఉంటారు అంటే రెండు కోట్లు ఇచ్చారని వినిపిస్తోంది. ఆమె రెమ్యునేషన్ తో కాకుండా ఆరు కోట్లు ఖర్చు అయ్యిందని సమాచారం. ఇక ఒరిజనల్ కొరియన్ ప్రొడ్యూసర్ కు రాయిల్టీగా 10 కోట్లు ఇచ్చారని , దాంతో మొత్తం 18 కోట్లు అయ్యిందని చెప్తున్నారు.

సమంత అక్కినేని, నందినీ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం `ఓ బేబి` . సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ వారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో సమంతతో పాటు సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూడా కీల‌క పాత్ర‌లో న‌టించారు.

ఈ చిత్రంలో ల‌క్ష్మి, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సాంకేతిక వ‌ర్గం: మ్యూజిక్‌: మిక్కి జె.మేయ‌ర్‌, కెమెరా: రిచ‌ర్డ్ ప్ర‌సాద్ , డైలాగ్స్‌: ల‌క్ష్మీ భూపాల్‌, ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధిఖీ, ప్రొడ‌క్ష‌న్ , డిజైన్‌:జ‌య‌శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌, నిర్మాత‌లు: సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, హ్యువు థామ‌స్ కిమ్ ,ఆర్ట్‌: విఠ‌ల్‌.కె, ద‌ర్శ‌క‌త్వం: బి.వి.నందినీ రెడ్డి, నిర్మాణ సంస్థ‌లు: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్రాస్ పిక్చ‌ర్స్‌, స‌హ నిర్మాత‌లు: విజ‌య్ దొంకాడ‌, దివ్యా విజ‌య్‌.