‘స్క్రీన్ ప్లే’ బై నాని…అలా సెట్ అయ్యింది

సెలక్టివ్‌గా కథలను ఎంచుకుంటూ మంచి హిట్స్ కొట్టడంలో నానికి ఈ తరంలో పోటీ లేరు. తన కెరీర్‌లో ఫ్లాపులు చాలా తక్కువకు కారణం అదే. నేచురాలిటీకి దగ్గరగా నాని సినిమాలు ఉండటంతో ప్రేక్షకాదరణ బాగా ఎక్కువ. దీంతో నాని కెరీర్‌లో విజయాలే ఎక్కువగా పలకరించాయి. అయితే నాని హిట్స్ వెనక ఓ రీజన్ కూడా చెప్పుకోవాలి అదే..ఆయన క్రియేటివిటి. డైరక్షన్ డిపార్టమెంట్ నుంచి వచ్చిన ఆయన సొంతగా డైలాగులు రాసుకోగలరు..కథలో మార్పులు చెప్పగలరు. మంచి కథ ఏదో ..చెత్త ఏదో జడ్జ్ చేయగలరు.

ఆ సృజనాత్మకతే మిగతా హిరోల నుంచి ఆయన్ని విభిన్నంగా నిలబెట్టింది. అయితే ఇప్పుడెందుకు చెప్తున్నాం అంటే నాని ఇప్పుడు ఓ కథకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. ఇంతకీ ఏమా కథ..ఎవరి సినిమా అంటారా..ఇంకెవరికో ఆయన ఎందుకు స్క్రీన్ ప్లే రాస్తారు. తను హీరోగా తెరకెక్కబోతున్న దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమాకు స్క్రీన్ ప్లే విషయంలో సహకారం అందిస్తున్నారు.

నాని, విక్రమ్ కలిసి గత కొద్ది రోజులుగా కథపై కూర్చుంటున్నారట. కథలో హీరోని కూర్చోబెడితే మరింతగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారని నమ్మే విక్రమ్ …నానిని ఆహ్వానించి కథ పై కూర్చో పెట్టారని సమాచారం. అయితే కథలోకి బాగా వెళ్లిపోయిన నాని ఇచ్చే ఇన్ పుట్స్ ..విక్రమ్ ని ఆశ్చర్యపరిచి..స్క్రీన్ ప్లే డిస్కస్ చేయటం మొదలెట్టారట. అలా ఇద్దరు కలిసి స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మరి రేపు తెరపై స్క్రీన్ ప్లే బై నాని అని వేసుకుంటాడో లేదో చూడాలి.

ప్రస్తుతం నాని జెర్సీ సినిమాలో నటిస్తున్నాడు. క్రీడా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే విక్రమ్ కుమార్‌తో సినిమాకు కమిట్ అయ్యాడు. అయితే వీరిద్దరి కాంబోలో గతంలోనే సినిమా రావాల్సి ఉంది కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో అది మిస్ అయింది. మళ్లీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరించనున్నారని మరో టాక్.