తాను చేస్తున్న ప్రతీ సినిమాలో ఏదో ఒక వైవిధ్యం ఉండాలని కోరుకుంటూ, అదే సక్సెస్ మంత్రగా భావిస్తూ దూసుకువెళ్తున్నాడు నాని. రీసెంట్ గా “జెర్సీ” తో ఓ మంచి ఎమోషనల్ హిట్ తో కొట్టారు నాని.ఈ సినిమాలో అర్జున్‌గా నాని అభినయానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. తన తదుపరి చిత్రంలో కర్ణుడుగా ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నట్లు సమాచాచారం.
తనను హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఓ వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కనున్న మూవీలో కలియుగ కర్ణుడు తరహా పాత్రలో కనిపించబోతున్నారట నాని. అందుతున్న సమాచారం బట్టి ఈ సినిమాలో నాని పూర్తిగా నెగిటివ్ క్యారక్టరైజేషన్ అయినా , ఫ్రెడ్షిప్ కోసం ప్రాణం అయినా ఇచ్చేస్తాడట.
ఫిల్మ్ నగర్ జనం చెప్పుకునేదాన్ని బట్టి మహాభారతంలో స్నేహధర్మం కోసం అధర్మం అని తెలిసినా దుర్యోధనుడి పక్షం నిలిచిన కర్ణుడిని పాత్రను పోలి ఉంటుందంట నాని పాత్ర. దాని వలన నాని చేస్తున్నది విలన్ పాత్ర అయినా ఆ భావన ప్రేక్షకులలో కలగదని చెప్తున్నారు. ఈ సినిమా హీరో సుధీర్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారు.
ఈ చిత్రం నాని ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “గ్యాంగ్ లీడర్” తరువాత నెట్స్ పైకెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్నది. కెరీర్ ఆరంభం నుంచి వినూత్న కథాంశాలతో సినిమాలు తీస్తుంటారు మోహనకృష్ణ ఇంద్రగంటి. టైటిల్స్ కూడా సృజనాత్మకంగా ఉండేలా చూసుకుంటారు. తాజాగా నాని చిత్రానికి వి అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారని తెలిసింది.
వి మతలబు ఏంటనేది సినిమా చూస్తేనే అర్థమవుతుందని, కథానుగుణంగానే ఆ టైటిల్‌ను పెట్టబోతున్నారని సమాచారం. గతంలో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని అష్టాచమ్మా జెంటిల్‌మన్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న వీరిద్దరు మూడోసారి కలిసి సినిమా చేయబోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.