‘సోగ్గేడే…’ డైరక్టర్ కు నాగ్ కండిషన్స్,వేరే దారిలేక …

హిట్ లో ఉన్నప్పుడు డైరక్టర్ టెర్మ్స్ డిక్టేట్ చేస్తాడు. అదే ప్లాఫ్ లో ఉంటే సినిమా రావటమే గొప్ప. ఆఫర్ వచ్చినా నిర్మాత, హీరో చెప్పినట్లు వినాలి. వాళ్లు పెట్టే కండీషన్స్ కు సై అనాలి. లేకపోతే ప్రాజెక్టు ఉండదు. ఇప్పుడు కళ్యాణ్ కృష్ణది అదే పరిస్దితి. రవితేజతో చేసిన నేల టిక్కెట్ సినిమాతో డిజాస్టర్ ఇవ్వటంతో ఆయన పరిస్దితి రివర్స్ అయ్యింది.

సోగ్గాడే చిన్నాయన తర్వాత ఆయనకు ఎంత క్రేజ్ వచ్చిందో అంత వెనక్కి ఈ సినిమా తోసేసింది., నేల టిక్కెట్ ఆయన్ను నేలకు తీసుకు వచ్చేసింది. దాంతో ఇప్పుడు దర్శకుడు కళ్యణ్ కృష్ణ తన తొలి చిత్రం సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.

కానీ మొదటే చెప్పుకున్నట్లు కళ్యాణ్ కృష్ణ కు ఇప్పుడు తన డిక్టేట్ చేసే పరిస్దితిలో లేడు. బంగార్రాజు టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే చాలా వెర్షన్స్ రాసారట. నాగ్ ఓ పట్టాన ఏదీ ఒప్పుకోలేదట. ఏదో కష్టపడి కథ లాక్ చేస్తే ఇప్పుడు రెమ్యునేషన్ విషయంలో నాగ్ ఓ కండీషన్ పెట్టారట. అదేమిటంటే…సినిమా రిలీజ్ అయ్యాక చూసుకుందాం..ప్రస్తుతానికి ఖర్చులు ఇస్తాం, సినిమా చెయ్యమని చెప్పారట.

కళ్యాణ్ కృష్ణకు మొదట ఈ కండీషన్ మింగుడు పడకపోయినా వేరే దారిలేక ఓకే చెప్పాడట. సినిమా రిలీజై హిట్టయ్యాక షేర్ ఇస్తానని ప్రామిస్ చేసారట. ఆ రకంగా బడ్జెట్ ని కంట్రోలు పెట్టచ్చు అనేది నాగార్జున ఆలోచనట.

ఈ సినిమాలో నాగచైతన్య కూడా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు నాగార్జున,నాగచైతన్యలను ఒప్పిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ నాగార్జునతో సోగ్గాడే చిన్న నాయినా, నాగచైతన్య…రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలు డైరక్ట్ చేయటంతో ఇద్దరితోనూ డైరక్ట్ రాపో ఉంది.

ఈ క‌థ మొత్తం బంగార్రాజు పాత్ర చుట్టూనే తిర‌గ‌నుండ‌గా, ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌ట‌. ఇక నాగ్ స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ‌ని ఎంపిక చేశార‌ని అంటున్నారు. చైతూ కూడా చిత్రంలో న‌టించ‌నున్నాడ‌ని స‌మాచారం. ఆయ‌న‌కి జోడీగా ఎవరిని ఎంపిక చేయాలా అని చిత్ర‌బృందం క‌స‌ర‌త్తులు చేస్తుంద‌ట‌. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.