ఇండస్ట్రీలో ముక్కుసూటిగా వెళ్లే మోహన్ బాబు తో ఎవరూ పెట్టుకోవటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆయన అంటే కొందరికి భయం,మరికొందరికి భక్తి. అందుకే ఆయనకు సంభందించిన మ్యాటర్స్ లో ఎవరూ వేళ్లు,కాళ్లూ పెట్టరు. కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం అటువంటిదేమీ చూసుకున్నట్లు లేదు.
రీసెంట్ గా ‘118’ సినిమాతో సక్సెస్ ని అందుకున్న హీరో కళ్యాణ్ రామ్ తన నెక్ట్స్ సినిమాను మొదలుపెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని మల్లిడి వేణు డైరెక్ట్ చేయనున్నాడు. కొంచెం మంచి బడ్జెట్ తోనే కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కల్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ట్స్ బ్యానర్‌పై ఈసినిమాను తెరకెక్కించనున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్‌ను పరిశీలించినా ఫైనల్‌గా రావణ అయితే బాగుటుందని ఫిక్స్ అయ్యారు.
అయితే కొద్దికాలం క్రితమే’రావణ’ పేరుతో సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో ఒక పౌరాణిక చిత్రం తీయాలని అనుకున్నారు. ఆ పనులు కూడా మొదలయ్యాయి. 100 కోట్లతో పౌరాణిక చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఇంతలోనే కళ్యాణ్ రామ్ ఆ టైటిల్ పెట్టుకుని సినిమాను అనౌన్స్ చేసేశాడు. మరిప్పుడు మోహన్ బాబుగారి సినిమా టైటిల్ సంగతేమిటి తెలియాల్సి ఉంది. దాంతో ఈ టైటిల్ విషయమై మోహన్ బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోహన్ బాబు సినిమా టైటిల్ చేంజ్ చేస్తారా..లేక కళ్యాణ్ రామ్ చేంజ్ చేసుకుంటాడా అనేది ఆసక్తికరమైన విషయంగా మీడియాలో మారింది. మోహన్ బాబు స్పందన ఏమిటనేది తెలియరాలేదు.