‘మహర్షి’: అశ్వనీదత్ తో తగువు, మహేష్ కు మండింది?

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా వస్తున్న ప్రెస్టిజియస్ మూవీ మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్దె నటిస్తుంది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మే 9న గ్రాండ్ గా రిలీజ్ అవనున్న ఈ సినిమా రన్ టైం పై ప్రస్తుతం ఓ న్యూస్ బయటకు వచ్చి ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు మహర్షి సినిమా కు డేట్స్ మొదట ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కు ఇచ్చినవే. ఆ తర్వాత దిల్ రాజు ఫైనాన్సియల్ రెస్పాన్సిబుల్టీస్ చూసుకుంటూ సీన్ లోకి వచ్చారు. ఇప్పుడు సినిమా మొత్తం పూర్తై రిలీజ్ కు రెడీ అయ్యింది. అయితే పెట్టుబడి రూపంలో రూపాయి కూడా పెట్టకుండా కేవలం తన తగ్గర డేట్స్ ఉన్నాయని ఇచ్చిన అశ్వనీత్ ..బిజినెస్ విషయంలో డిమాండ్స్ చేస్తున్నట్లు సమాచారం.

నాని, నాగార్జున కాంబినేషన్ లో అశ్వనీదత్ నిర్మించిన ‘దేవదాసు’ తాలూకు బకాయిలు నైజాం డిస్ట్రిబ్యూటర్ సునీల్ కి కోటి అరవై లక్షల వరకు చెల్లించాల్సివుందట. ఇప్పటివరకు వాటి సెటిల్మెంట్ జరగలేదు. దీంతో ఇప్పుడు ‘మహర్షి’బిజినెస్ లో దాన్ని అడ్జస్ట్ చేయమని సునీల్ అడిగినట్లు సమాచారం. అశ్వనీదత్ అందుకు ఒప్పుకున్నా.. మిగిలిన ఇద్దరు నిర్మాతలు దిల్ రాజు, పివిపిల నుండి వ్యతిరేకత వచ్చిందట. ‘మహర్షి’ సినిమా నూట యాభై కోట్ల బిజినెస్ చేసినప్పుడు ఆ చిన్న మొత్తం అడ్జస్ట్ చేయలేరా అంటున్నారట.

పోనీ అది ఎడ్జెస్ట్ చేయకపోతే కృష్ణా ఏరియా రైట్స్ అయినా తనకు ఇవ్వమని దత్ పట్టుపడుతున్నారట. వాటాగా ఓ ఏరియా ఇలా ఇచ్చేస్తాం..లాభాల్లో షేర్ ఇస్తామని ఎగ్రిమెంట్ చేసుకున్నాం కదా అని మిగతా ఇద్దరు నిర్మాతలు చెప్తున్నారు. ఈ విషయమై కోర్టుకు వెళ్తారని వినిపిస్తోంది. చివరకు ఏమౌతుందో చూడాలి.