అఖిల్ అక్కినేని మూడో సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. పెద్ద డైరక్టర్స్, పెద్ద బ్యానర్స్ తోనే ముందుకు వెళ్తున్నా కలిసి రావటం లేదు. మినిమం యావరేజ్ సినిమా కూడా అనిపించుకోలేకపోతోంది. అందుకు కారణం ఏమిటి ..సినిమాలు నిజంగానే అంత చెత్తగా ఉన్నాయా లేక మరొకటా అనేది ఇండస్ట్రిలో, అభిమానుల్లో చర్చ మొదలైంది. అయితే అఖిల్ ప్లాఫ్ లకు కారణం అతనిపై ఉన్న నెగిటివిటి కొంతవరకూ కారణం అంటున్నారు. మూడు ఫ్లాఫ్ లు వరసగా వచ్చినా..అయ్యో …అఖిల్ అన్నవారు కనపడటం లేదంటున్నారు.
తొలి చిత్రం నుంచి అఖిల్ చేసిన హడావిడి, హంగామా…ఈ రోజు అతని కెరీర్ పై ఇంపాక్ట్ చూపెడుతున్నాయని చెప్పుకుంటున్నారు. తొలి సినిమా రిలీజ్ కాకముందే ఓవర్ చేసాడని, మొదట సినిమా కథనే… ప్రభాస్ లాంటి స్టార్ హీరో చెయ్యాల్సిన దాన్ని ఎంచుకుని మాస్ హీరోగా అందరికీ కౌంటర్ ఇద్దామని బయిలుదేరాడని విమర్శలు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఒక్క సినిమా కూడా హిట్ కాకముందే తన గొప్ప చూపాలన్నట్లుగా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు పనిచేసాడని, స్టార్ హీరోలెవిల్లో అతను ఇచ్చిన బిల్డప్పే కొంప ముంచిందని విశ్లేషిస్తున్నారు.
అఖిల్ అదంతా తన కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు కానీ అది యారగెంట్ అనుకుంటారని అర్దం చేసుకోలేకపోయాడని , అవే అతని సినిమా సక్సెస్ ల మీద ప్రభావం చూపెడుతున్నాయంటున్నారు. పెద్ద హీరోలతో పార్టీలు చేసుకుని ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయటం..వాళ్లతో నేను సమానం అని చెప్దామనే ప్రయత్నంగా ఉన్నాయంటున్నారు.
దాంతో మిస్టర్ మజ్ను సినిమాని థియోటర్ కు వెళ్లి చూడటానికి కూడా ఆసక్తి చూపటం లేదని, ఫ్యామిలీ ఫ్యాన్స్ పట్టించుకోవటం లేదని అఖిల్ చేతులారా చేసుకున్నదే అని తేలుస్తున్నారు. ఇందులో నిజమెంత ఉందనేది ప్రక్కన పెడితే అఖిల్ మాత్రం ముందు అభిమానులను పోగు చేసుకోవాలి. నెగెటివిటీ ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.