రిలీజ్ కాకముందే రచ్చ వద్దని వారించిన మోహన్ బాబు

లక్ష్మీస్  ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ అయిన నాటి నుంచీ తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా గురించే చ‌ర్చ న‌డుస్తోందనటంలో అతిశయోక్తి లేదు. వాస్తవానికికి ఎన్టీఆర్ క‌థానాయకుడు విడుద‌లైన‌పుడు కూడా ఇంత‌గా చ‌ర్చ జ‌ర‌గ‌లేదు కానీ వ‌ర్మ మాత్రం సరికొత్త ఆలోచనలతో, సంచలనాలకు తెర‌తీసాడు. ల‌క్ష్మీపార్వ‌తి కూడా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్ గురించి మాట్లాడుతూ వ‌ర్మ అద్భుతం చేసాడని కితాబు ఇచ్చేసింది.

అయితే అదే సమయంలో ఈ సినిమాలో మోహన్ బాబు ని ఎలా చూపించారు..దానిపై మోహన్ బాబు ఎలా స్పందిస్తారనేది కూడ హాట్ టాపిక్ గా మారింది. అయితే వర్మకు, మోహన్ బాబుకు ఉన్న రిలేషన్ ని బట్టి…ఆయన్ని బ్యాడ్ గా చూపరని కొందరంటున్నారు.

అయితే ఎన్టీఆర్ కు వెన్నుపోటు రాజ‌కీయం జరిగిన సమయంలో మోహన్ బాబు కూడా అక్క‌డే ఉన్నాడ‌ని.. అన్న‌య్య అన్న‌య్య అంటూ ఆయ‌న కూడా చంద్రబాబుతో చేతులు కలిపారని ఆరోపణలు చేసింది ల‌క్ష్మీ పార్వ‌తి. ఈ నేపధ్యంలో ఆమె వెర్షన్ ప్రకారం తీస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబుని ఖచ్చితంగా నెగిటివ్ గా చూపించాలి. మోహన్ బాబుని అలా చూపిడితే ఊరుకుంటారా , ఆ విషయం వర్మకు తెలియదా అనేది ప్రశ్న.

అయితే ఈ విషయమై మోహన్ బాబుని ఆయన సన్నిహితులు…సినిమాలో ఆయన పాత్ర గురించి అడమగమని కోరారట. కానీ మోహన్ బాబు ఇష్టపడలేదని సమాచారం. సినిమా రిలీజ్ అయ్యాక చూద్దాం…మన పాత్ర ఏమిటో తెలియకుండా తొందరపడి మీడియాలో అల్లరి అవటం ఎందుకు…అని సున్నితంగా తిరస్కరించారట. వర్మపై మోహన్ బాబుకు నమ్మకం ఉంది తనను బ్యాడ్ గా చూపించరని అంటున్నారు. మోహన్ బాబు ముక్కుసాటితనం, స్టైయిట్ ఫార్వర్డ్ నెస్ ని ఎన్టీఆర్ మెచ్చుకునేవారని చెప్తారు. అదే హైలెట్ చేస్తారు సినిమా లో అని మంచు అభిమానులు భావిస్తున్నారు.