రష్మిక మ్యాటర్ లో ఆ నిర్మాతలు వాదన అర్దం లేనిదే
తెలుగులో స్టార్ హీరోయిన్ ఎవరూ అంటే తముడుకోకుండా చెప్పే పేరు రష్మిక మందన్నా. ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఆమె ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘గీత గోవిందం’సినిమా చేసింది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో ఆమె దశ ఒక్కసారిగా తిరిగిపోయింది.వరసగా తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి పెద్ద స్టార్లతో సినిమాలు చేస్తోంది. ఇది ఆమె మాతృభాష కన్నడ నిర్మాతలకు బాధగా మారింది.
తమ కన్నడ అమ్మాయి…తెలుగుకు వెళ్లి స్టార్ అయ్యిందన్న ఆనందం వారిలో ఏ మాత్రం లేదు. తాము కన్నడలో ‘కిరిక్ పార్టీ’తో పరిచయం చేసి నిలబెడితే కన్నడంలో సినిమా లు చేయమంటే నో చెప్తోంది, డేట్స్ లేవని చెప్తోందని వాపోతున్నారు. అయితే రష్మిక మందన్నా వాదన మరో రకంగా ఉంది. తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నప్పుడు వదులుకుని కన్నడంకు వెళ్లాల్సిన పనేంటని అంటోంది.
అంతేకాదు తెలుగులో ఆమెకు భారీగా రెమ్యునేషన్ తీసుకుంటోంది. కన్నడంలో అంత సీన్ లేదు. అలాంటప్పుడు అక్కడి వారికి డేట్స్ ఎలా ఇస్తుంది. తనను ఎప్రోచ్ అయ్యే కన్నడ నిర్మాతలకు ఆమె చెప్పే రెమ్యునేషన్ కు తల తిరుగుతోందిట. అంత మన కన్నడ సినిమాలో వర్కవుడ్ కాదు కదా అంటే, నేనేం కన్నడంలో చేస్తానని వెంటబడటం లేదు కదా అని అంటోందికదా. అదీ నిజమే డిమాండ్ ని బట్టే సప్లై.
రీసెంట్ గా తన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ను ప్రమోట్ చేయడం కోసం బెంగళూరుకు వెళ్లిన రష్మికను లోకల్ మీడియా రెమ్యూనరేషన్ హైక్ గురించి అడిగింది. వెంటనే రష్మిక కౌంటర్ ఇచ్చింది.. మీడియాలో ఉన్న మీరు ఏటా హైక్స్, ప్రమోషన్లు కోరుకోరా? అలాంటపుడు నేను రెమ్యునేషన్ పెంచడంలో సమస్యేంటి అంది.