ఆయనొక సక్సెస్ ఫుల్ నిర్మాత. ఆయన జడ్జిమెంట్‌కు తిరుగులేదు. ఆయన ఏదైనా స్క్రిప్ట్‌ని ఓకే చేస్తే అది ప్రేక్షకల్ని అలరించాల్సిందే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌ల వర్షం కురిపించాల్సిందే. విమర్శకుల ప్రశంసలు అందుకోవాల్సిందే… ఇది నిన్నటి మాట. ఇప్పుడు ఆయన జడ్జిమెంట్ కు ఏమైంది. కథా చర్చల్లో పాల్గొన్నా ఆ సినిమా జనాల్ని ఆకట్టుకోవడం లేదు. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపించడం లేదు. ఆ బడా నిర్మాత మరెవరో కాదు సక్సెస్‌ఫుల్ చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు.
ఆడియన్స్ పల్స్ తెలిసిన నిర్మాతగా పేరున్నా ఆయన జడ్జిమెంట్ పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోతోంది. ఇటీవల దిల్ రాజు క్యాంప్ నుంచి వచ్చిన `ఇద్దరి లోకం ఒకటే` ఎంత ప్రచారం చేసినా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పేలవమైన కలెక్షన్‌లని రాబట్టిన ఈ సినిమా ఓవర్సీస్‌లో వన్ మిలియన్ కూడా దాటక పోవడం దిల్ రాజు జడ్జిమెంట్‌పై అనుమానాల్ని రేకెత్తిస్తోంది.