ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో తమిళ స్టార్ దర్శకుడు శంకర్ కూడా ఒకరు. తన విజన్, కథలు తో ఎప్పుడో ఇండియన్ సినిమా నుంచి వరల్డ్ క్లాస్ సినిమాలను తాను అందించాడు. మరి ఇప్పుడు శంకర్ కి కూడా గడ్డు కాలం నడుస్తుండడంతో తన లెవెల్ హిట్ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి అలాంటి హిట్ సినిమాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్న 15వ సినిమా నిలుస్తుందని సినీ వర్గాలు అభిమానులు బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ సినిమా విషయంలో శంకర్ కూడా చాలా సీరియస్ గా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకి శంకర్ అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత అనేది తెలుస్తుంది.
అయితే ఇది ఒకింత షాకింగ్ అని చెప్పాలి. ఈ సినిమా కోసం శంకర్ ఇప్పటివరకు అడ్వాన్స్ కూడా తీసుకోలేదట. అంతే కాకుండా జీరో రెమ్యునరేషన్ తో ఈ సినిమా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో చేస్తున్నారని ఇన్సైడ్ టాక్. మరి శంకర్ కి ఎలా అంటే..
సినిమా రిలీజ్ అయ్యి వచ్చే వసూళ్ళలో ఏకంగా 50 శాతం వాటా తాను తీసుకోనున్నట్టుగా చెబుతున్నారు. దీనికి నిర్మాత దిల్ రాజు ఒప్పుకున్నాడో లేదో కానీ శంకర్ అయితే ఈ ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది. మరి దీనిలో ఎంతవరకు నిజం ఉందో అనేది కూడా తెలియాల్సి ఉంది.