ఇన్సైడ్ టాక్స్ : పవన్ డైరెక్టర్ తో రామ్ చరణ్ భారీ సినిమా? మేటర్ ఏంటంటే!

Ram charan about Chiranjeevi and Pawan kalyan At Uppena Success event

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో సినిమాలు హిట్స్ చాలా తాక్క్కువే ఉంటాయి. మరి తన కెరీర్ లో మూడున్నర ఏళ్ళు తర్వాత ఓ కం బ్యాక్ సినిమాలా వచ్చిన చిత్రం “వకీల్ సాబ్”. ఇక మరో పక్క మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పలు భారీ సినిమాలతో రెడీగా ఉన్నాడు.

అయితే పవన్ తో వకీల్ సాబ్ సినిమా తర్వాత ఆ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ మళ్ళీ మరో సినిమా ఓకే చేయలేదు. మధ్యలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చెయ్యాల్సి ఉంది కానీ కొన్ని కారణాల చేత ఆగిపోయింది.

ఇక మళ్ళీ వేణు శ్రీరామ్ ఎలాంటి సినిమాకి లాక్ కాకపోగా ఇప్పుడు అయితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని డైరెక్ట్ చేయనున్నట్టుగా సినీ వర్గాల నుంచి ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. ఇక అలాగే మరో ఏమిటంటే ఈ చిత్రాన్ని ప్రముఖ భారీ సినిమాల నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు చేయనున్నారని అంటున్నారు.

మరి ఈ సెన్సేషనల్ కాంబో ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. ప్రస్తుతం అయితే పవన్ హరిహర వీరమల్లు అలాగే రామ్ చరణ్ శంకర్ తో తన RC 15 సినిమాల్లో బిజీగా ఉన్నారు.