లేటెస్ట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర నుంచి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో అందులోని మంచి మల్టీ స్టారర్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి ఆలాగే బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ లు నటిస్తున్న భారీ చిత్రం “గాడ్ ఫాదర్” కూడా ఒకటి.
మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫెర్ కి రీమేక్ గా తెలుగులో దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. అయితే ఆల్ మోస్ట్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఆల్రెడీ అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసేసారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడినట్టుగా సినీ వర్గాల నుంచి ఇన్సైడ్ వర్గాల రిపోర్ట్స్.
అయితే దీనికి కారణం ఏమిటంటే సినిమా రిలీజ్ కి ఇంకా నెల రోజులు కూడా ఉండకపోగా దీనితో ప్రమోషన్స్ విషయంలో ప్లానింగ్ సరిపొవట్లేదని మేకర్స్ అభిప్రాయపడుతున్నారట. దీనితో దీనితో ఈ చిత్రాన్ని మరో వారం కానీ నెలాఖరుకి వాయిదా పడినట్టుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు.
దీనితో అయితే అనుకున్న సమయానికి ఈ సినిమా రావట్లేదని ఇప్పుడు భోగట్టా. మరి దీనిపై అయితే అధికారిక అప్డేట్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మరి దీనిపై ఎప్పుడు వస్తుందో చూడాలి.