బాలయ్య టైటిల్ గోపిచంద్ కొత్త చిత్రానికి….

హిట్ కోసం పాత కథలనే కాదు టైటిల్స్ ను కూడూ రిపీట్ చేస్తూంటారు మన దర్శక,నిర్మాతలు. హిట్ సినిమా టైటిల్ పెడితే తాము హిట్ కొడతామనే నమ్మకం వీరిని ఆ దిసగా ప్రేరేపిస్తూంటుంది. ఇప్పుడు గోపిచంద్ అదే పద్దతిలో బాలకృష్ణ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఓ చిత్రం టైటిల్ ని పెట్టి సినిమా చేస్తున్నాడని సమాచారం.

గత కొంతకాలంగా గోపీచంద్ సినిమా ఏదీ భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. లౌక్యం సినిమా తర్వాత చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటీ పడలేదు. ఈ నేపధ్యంలో తమిళ దర్శకుడు ‘తిరు’తో ఒక కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు గోపిచంద్‌. ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది.

ఈ సినిమాకి బాలయ్య కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ‘బంగారు బుల్లోడు’ టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయనున్నారట‌. తనను ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడం కోసం హీరో ఎలాంటి సాహసాలు చేశాడనే కథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోందట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు గోపీచంద్ సరసన అలరించనున్నట్టుగా సమాచారం.