అనుకున్నది సాధించాడు, అల్లు అర్జున్ డేట్స్ పట్టాడు

ప్రతీ దర్శకుడుకు టాప్ స్టార్స్ తో సినిమా చెయ్యాలనే కల ఉంటుంది. కొందరికి అది సుదీర్ఘ ప్రయాణం అయితే, మరికొందరికి అది వెంటనే దొరికే గిప్ట్. ఇప్పుడు పరుశరామ్ పరిస్దితి అదే. రవితేజ వంటి స్టార్ హీరోతో కెరీర్ ప్రారంభంలోనే సినిమా చేసిన దర్శకుడు పరుశరామ్ ..ఆ తర్వాత ప్లాఫ్ లతో వెనకపడ్డారు. కానీ గీతా ఆర్ట్స్ బ్యానర్ ఆదుకుని ..అతన్ని ఆకాశంలో నిలబెట్టింది. గీతాగోవిందం వంటి హిట్ ఇచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా ఓకే చేసింది.

అందుతున్న సమాచారం ప్రకారం పరుశరామ్ పుట్టిన రోజు సందర్బంగా…ఈ విషయాన్ని ఖరారు చేసారు. అయితే అల్లు అర్జున్ తో సినిమా అని డైరక్ట్ చెప్పకుండా ఓ స్టార్ హీరో తో సినిమా అన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని తెలియచేసారు. అయితే ఆ స్టార్ హీరో మరెవరో కాదు..అల్లు అర్జున్ అని తెలిసింది.

విజయ్ దేవరకొండ రష్మిక జంటగా నటించిన ‘గీత గోవిందం’ ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. దాంతో ఆ చిత్ర దర్శకుడు పరుశరామ్ ..స్టార్ హీరోలకు హాట్ ఫేవరెట్ గా మారిపోయారు. దాంతో ఆయనతో సినిమా చేయాలని చాలా మంది హీరోలు,నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ పరుశరామ్ మాత్రం గీతా ఆర్ట్స్ లోనే ఉండిపోయారు. అక్కడే మరో సినిమా చేద్దామని ఆగిపోయారు. అందుకు కారణం అల్లు అరవింద్ మాత్రమే కాదు..అల్లు అర్జున్ కూడా. తన కెరీర్ లో అల్లు అర్జున్ తో సినిమా చెయ్యాలని వెయిట్ చేస్తూ వస్తున్న పరుశరామ్ కు ఆ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావటం కలిసి వచ్చింది.

వాస్తవానికి పరుశరామ్ కు బయిట నిర్మాతల నుంచి భారీ ఆఫర్సే వచ్చాయిట. రెమ్యునేషన్ పరంగా కూడా గీతా ఆర్ట్స్ వారు ఇస్తానని ఆఫర్ చేసే ఎమౌంట్ కు రెట్టింపు ఉందిట. కానీ తను గాడ్ ఫాధర్ గా భావించే అల్లు అరవింద్ మాట ప్రకారం మరో సినిమా గీతా ఆర్ట్స్ లో చేయాలని పరుశరామ్ ఫిక్స్ అయ్యారట. ఎందుకంటే తను ఫ్లాఫ్ ల్లో ఉన్నప్పుడు చేరదీసి శ్రీరస్తు ..శుభమస్తు చిత్రం ఇచ్చి నిలబెట్టారు. ఆ తర్వా విజయ్ దేవరకొండ డేట్స్ తెచ్చి ..సినిమా చేయించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అల్లు అరవింద్ గీసిన గీత దాటకూడదనే ఫిక్స్ అయ్యాడట. అలా అల్లు అర్జున్ డేట్స్ సంపాదించాడు.