నాని ‘గ్యాంగ్‌ లీడర్’ టైటిల్ మార్పు

నాని‘గ్యాంగ్‌ లీడర్’టైటిల్ మార్పు

నాని తాజా చిత్రం గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్ సమస్య తీరేటట్లు లేదు. షూటింగ్ మొద‌ల‌వ్వ‌క ముందు నుంచి షాక్ కొడుతూ వస్తున్న ఈ చిత్రం వివాదం ముగిసేటట్లు కనపడటం లేదు. గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్ పెట్టిన రోజు నుంచి మెగా ఫ్యాన్స్ దాన్ని మార్చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. అంతేకాకుండా మ‌రో ప‌నేది పెట్టుకోకుండా నానిని ట్రోల్ చేసారు. అయితే ఆ గొడవ కాస్త చ‌ల్ల‌బ‌డిపోయింది అనుకుంటున్న టైమ్ లో మ‌రో గ్యాంగ్ లీడ‌ర్ ర‌చ్చ మొద‌లైంది.

ఈ సారి మ‌రో గ్యాంగ్ తమదే టైటిల్ అంటూ బ‌య‌ల్దేరింది. వాళ్లు తాము రిజిస్ట్రర్ చేసిన టైటిల్ తో సినిమా చేస్తారంటూ ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేసారు. మైత్రీ మూవీస్ కన్నా ముందే తాము రిజిస్ట్రర్ చేసామని చెప్పారు. సీరియస్ లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. దాంతో ఇప్పుడు టైటిల్ మార్చటం తప్పనిసరి అవుతోంది.

అందుతున్న సమచారం మేరకు ..ఈ సినిమాకు నాని గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ పెట్టి రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నాని అనేది చిన్న అక్షరాలతో గ్యాంగ్ లీడర్ అనేది పెద్ద అక్షరాలతో ఉంటుంది. ఈ టైటిల్ ని రిజిస్టర్ చేసారు. అదే సమయంలో అనవస వివాదాలు రాకుండా ఫైనాన్సియల్ సెటిల్మెంట్ సైతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నారు.

నేచురల్‌ స్టార్ నాని, విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్‌ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గ్యాంగ్ లీడర్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే సాహో సినిమాను అదే రోజు రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించటంతో గ్యాంగ్ లీడర్‌ టీం ఆలోచనలో పడ్డారు.

సాహో లాంటి భారీ చిత్రంలో పోటి పడే కన్నా రిలీజ్‌ వాయిదా వేయటం బెటర్‌ అన్న ఆలోచనలో ఉన్నారట. అందుకే ముందుగా అనుకున్నట్టుగా ఆగస్టు 30న కాకుండా సినిమాను సెప్టెంబర్‌ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నాని సరసన ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుథ్ సంగీతమందిస్తున్నాడు.