‘మహర్షి’: మతిపోయిందా,ఇలా చేస్తే అంతే?

సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం మహర్షి. మొన్న గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు ఎంత హిట్ టాక్ వినిపించినా, లెంగ్త్ విషయంలో విమర్శలు వచ్చాయి.

దాదాపు మూడు గంటల ఈ సినిమా మినిమం ఓ అరగంట కోత పెడితే బాగుండును అన్నారు. వాటిని వంశీ పైడిపల్లి, దిల్ రాజు తిప్పి కొట్టే ప్రయత్నం చేసారు. ఆ సీన్స్ అన్ని సినిమాకు అవసరమే అన్నారు. చేసేదేముంది జనం చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ లెంగ్త్ ని మరింతగా పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని మీడియాలో వార్తలు మొదలయ్యాయి.

హిట్ టాక్ వచ్చిన నేపధ్యంలో మహర్షి టీం మరికొన్ని సీన్స్‌ను యాడ్ చేసేందుకు రెడీ అవుతుందన్న మీడియాలో వార్త స్పెడ్ అవుతోంది. హీరోయిన్‌ ఇంటికి రిషి (మహేష్ బాబు) వెళ్లే సీన్‌ లెంగ్త్ పెంచటంతో పాటు సెకండ్‌ హాఫ్‌లోనూ రెండు సీన్స్ ను యాడ్ చేయనున్నారట. ఇప్పటికే లెంగ్త్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న మహర్షి సినిమాకు ఈ లెంగ్త్ పెంచే కార్యక్రమం రిస్కే అంటున్నారు. అప్పుడు మూడు గంటలు దాటిపోతుంది. రిపీట్ ఆడియన్స్‌ కోసం చేస్తున్న ఈ ప్రయోగం వర్క్‌ అవుట్ అవటం కష్టమే అంటున్నారు.

మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా మే 9న వరల్డ్ వైడ్ గా విడుదలయింది. రైతుల సమస్యల ప్రధాన అంశంగా తెరకెక్కిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా అల్లరి నరేష్, జగపతి బాబు, కమల్ కామరాజ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.