స‌రిలేరు సెన్సార్ యుఏ.. రిలీజ్ తేదీ ఇంకా స‌స్పెన్స్!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. అనీల్ రావిపూడి ద‌ర్శ‌కుడు. ర‌ష్మిక మంద‌న క‌థానాయిక‌. లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి మ‌హేష్ కి ధీటైన పాత్ర‌లో న‌టిస్తున్నారు. అనీల్ సుంక‌ర‌- దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని అత్యంత భారీగా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.

తాజాగా సెన్సార్ రిపోర్ట్ అందింది. ఈ చిత్రానికి సెన్సార్ బృందం యుఏ స‌ర్టిఫిక‌ట్ ఇచ్చింది. ఇక ఈ సీజ‌న్ లో అదిరిపోయే ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది అని తెలుస్తోంది. అలాగే అనీల్ రావిపూడి మార్క్ కామెడీ.. పంచ్ లు అల‌రించ‌నున్నాయ‌ట‌. మ‌హేష్ ఈ చిత్రంలో ఆర్మీ మేజ‌ర్ గా న‌టిస్తున్నారు. ఒక ఆర్మీ మేజ‌ర్ క‌ర్నూల్ వ‌చ్చాక ఏం జ‌రిగింది? అన్న‌ది తెర‌పైనే చూడాలి. 

 
ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. ర‌ష్మిక‌తో రొమాన్స్ ఆక‌ట్టుకోనుంది. ఇందులో ప్రొఫెస‌ర్ భార‌తి అనే పాత్ర‌లో విజ‌య‌శాంతి న‌ట‌న సినిమాకే హైలైట్ గా నిల‌వ‌నుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ పోస్ట‌ర్ లో రిలీజ్ తేదీని ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. బ‌హుశా స‌రిలేరు తేదీ మారుతుందా? అంటూ ఓ కొత్త డౌట్ రైజ్ అవుతోంది ఫ్యాన్స్ లో.
New suspense is created over Sarileru Nekevvaru release date. In the U/A censor certificate, the absence of Sarileru Nekkavaru release date was conspicuous.