కష్టాల్లో సమంత, చైతూల ‘మజిలీ’?

నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా మజిలి. వివాహానంతరం ఈ జంట కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావటంతో మజిలిపై మంచి అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిన్నుకోరి ఫేమ్ శివా నిర్వాణ దర్శకుడు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌. వేసవి శెలవలు ఉండే సీజన్‌ కావటంతో కలెక్షన్లు కూడా బాగుంటాయని ఆ తేదీని నిర్ణయించారు. పబ్లిసిటీ కూడా బాగానే చేస్తన్నారు. ఇప్పటికే ఈ గోపి సుందర్‌ అందించిన పాటలు జనాల్లోకి వెళ్ళాయి.

అంతాబాగానే ఉంది కానీ ఇప్పుడు ఎలక్షన్‌ల హడావిడితో మజిలీకి కష్టాలు తప్పేలా లేవని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ ప్రభావం మజిలీ కలెక్షన్ల మీద పడే ప్రభావం ఉందని భావిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మజిలీని చెప్పిన డేట్‌కే రిలీజ్ చేయటం కన్నా వాయిదా వేస్తే బెస్ట్ అని అభిమానులు అంటున్నారు. అదే రోజు విడుదల కావాల్సిన నాని జెర్సీ సినిమాను ఇప్పటికే ఏప్రిల్‌ 19కి వాయిదా వేశారు. మరి మజిలీ టీమ్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ‘నిన్ను కోరి’ ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విష్ణు వర్మ.