దిల్ రాజు షాకింగ్ డెసిషన్, నిజమైతే… ఇండస్ట్రీకు పెద్ద నష్టమే

ప్రముఖ నిర్మాత దిల్ రాజు…తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూసారు. అదే సమయంలో డిజాస్టర్స్ చూసారు. అయితే ఆయన నిర్మాతగా కెరీర్ ప్రారంభించకముందే పంపిణీదారుడుగా ఫేమస్. ఇప్పటికీ ఆయన సినిమా రైట్స్ కొన్నారంటే మిగతా డిస్ట్రిబ్యూటర్స్ కు ఓ నమ్మకం. వెంటనే బిజినెస్ క్లోజ్ అవుతుంది. అయితే ఆయన త్వరలో డిస్ట్రిబ్యూషన్ కు బై చెప్పబోతున్నట్లు సమాచారం. ఎందుకంటే నిర్మతగా హిట్స్ ఇచ్చినా, డిస్ట్రిబ్యూటర్స్ గా కొన్న సినిమాలతో దెబ్బ తిన్నారు.

జ‌గ‌ప‌తి బాబు పెళ్లి పందిరి చిత్రంతో దిల్ రాజు పంపిణీ రంగంలో ప్ర‌వేసించి మొన్న 2.0 వ‌ర‌కూ ఎన్నో చిత్రాల్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. రీసెంట్ గా ఈ రంగంలో న‌ష్టాలు బెంబేలెత్తించ‌డ‌మే రాజుగారి షాకింగ్ నిర్ణ‌యానికి అస‌లు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. బ‌య‌టి సినిమాల్ని ఇక పొర‌పాటున కూడా డిస్ట్రిబ్యూట్ చేయ‌న‌ని రాజుగారు అన్నారంటే పరిస్దితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు అంటున్నారు.

మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా జరిగిన ఎఫ్ 2 స‌క్సెస్ మీట్ అనంత‌రం దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగటం విశేషం. దిల్ రాజు గారు సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేయ‌రు. ఈ రంగాన్ని పూర్తిగా వ‌దిలేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

ఈ సంక్రాంతికి ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన వినయ విధేయ రామ పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో ఆయన నిర్మించిన ఎఫ్ 2 చిత్రం పెద్ద హిట్ అయ్యింది. దాంతో ఆయన బయిట చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది. అందులో నిజమెంత ఉందనేది తెలియదుకానీ, ఆయన ఆ డెసిషన్ తీసుకుంటే మాత్రం ఇండస్ట్రీకు పెద్ద దెబ్బే. ఎందుకంటే నైజాంలో సాలిడ్ గా రిలీజ్ చేయగలిగే నిర్మాత ఆయన. ఆయన రైట్స్ తీసుకున్నారంటే నిర్మాత నిశ్చింతగా ఉండగలుగుతాడు.