సాధారణంగా సినిమా పరిశ్రమలో కథలు రాసుకునేటప్పుడు ఒక హీరోను దృష్టిలో పెట్టుకొని రాస్తుంటారు. అలా రాసుకున్న కథలు… అనుకున్న హీరోలకు కాకుండా రకరకాల కారణాలతో మరో హీరోకు సెట్ అవుతుంటాయి. సైరా కథ కూడా అలాగే సెట్ అయ్యిందని సమాచారం. మొదట ఎవరు సైరా పాత్రకు అనుకున్నారు…ఆ విషయాలు చూద్దాం.
మెగాస్టార్ తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపిస్తున్న చిత్రం సైరా చిత్రం . ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. చిరు తనయుడు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు.భారీ గ్రాఫిక్స్, చిరు గెటప్, సెట్స్ ఇలా అన్ని సినిమాలోని భారీతనాన్ని చూపించేలా రూపొందిస్తున్నారు.
ముందుగా ఈ చిత్ర కథను బాలకృష్ణ హీరోగా భావించి పరుచూరి బ్రదర్స్ కథ రాసుకున్నారట. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదట. దాంతో ఆ కథను చిరంజీవి కి చెప్పగా..ఆయన కాస్త గ్యాప్ తీసుకొని ఓకే చేశారని చెప్తున్నారు. ఈ కథను చిరు 150 వ చిత్రంగా తెరక్కించాలని అనుకున్నారట..కానీ అది కుదరక 151 గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అలా బాలకృష్ణ చెయ్యాల్సిన కథతో చిరంజీవి సైరా.. అయ్యాడు.
ఇప్పటికే మేజర్‌పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు జగపతి బాబు, సుధీప్, విజయ్ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. నయనతార, చిరు సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా తమన్నా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ భారీ చారిత్రక చిత్రాన్ని సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: రత్నవేలు.