పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’ సినిమాలో కనిపించిన నటి అనీషా ఆంబ్రోస్ గుర్తుందా…ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. గత నెల గుణ జక్క అనే వ్యక్తితో రహస్యంగా ఆమె ఎంగేజ్మెంట్ జరిగినట్లు సమాచారం. అత్యంత సన్నిహితులు,కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది. గుణ ఆమెకు చాలా కాలంగా స్నేహితుడు, బోయ్ ఫ్రెండ్ కావటంతో పెద్దల అనుమతితో ఈ వివాహ సన్నాహాలు మొదలయ్యాయి.
‘సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ అయ్యింది. కేవలం ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ మాత్రమే వచ్చారు. వచ్చే నెలలో వీరి వివాహం ఘనంగా జరగబతోంది’ అని ఆమె సన్నిహితులు చెప్తున్నారట. ఇక ఎంగేజమెంట్ లో తీసిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వైజాగ్‌కు చెందిన అనీషా ‘అలియాస్ జానకి’ సినిమాతో 2013లో నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘గోపాల గోపాల’, ‘మనమంతా’, ‘ఒక్కడు మిగిలాడు’ తదితర సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. గత ఏడాది ఆమె నటించిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా విడుదలైంది. అందం, అభినయం ఉన్నా అనీషా కు తెలుగులో ఊహించిన స్దాయిలో బ్రేక్ రాలేదు. దాంతో ఆమె కన్నడ, మలయాళ, తమిళ చిత్రాల్లోనూ నటించారు.