పాపం ‘అల్లరి’నరేశ్‌.. అనుకున్నట్లే దెబ్బ పడిందే

ఒక సినిమా లో ఓ పాత్ర హిట్ అయ్యితే ఆ నటుడు కు అలాంటి పాత్రలే వరస పెట్టి వస్తూంటాయి. ఇప్పుడు అల్లరి నరేష్ కు అదే జరుగుతోంది. చాలా కాలంగా సరైన హిట్స్‌ లేక భాక్సాఫీస్ వద్ద వెనకబడ్డ ‘అల్లరి’ నరేశ్‌కు.. ‘మహర్షి’లో పాత్ర క్లిక్ అయ్యింది. సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో నరేశ్‌ ‘రవి’ అనే స్నేహితుడి పాత్రలో నటించి మెప్పించారు.

సినిమా హిట్ లో అతనికీ భాగముంది అనిపించేలా ..తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత అతనికి వరసపెట్టి సినిమాలు వస్తాయని, హీరోగా బిజీ అవుతానని భావించాడు. కానీ రివర్స్ లో జరిగింది. వరసలో ఆఫర్స్ వస్తున్నాయి. కాని అవన్నీ పెద్ద హీరోల సినిమాల్లో సైడ్ రోల్సే. వాటిని కీ రోల్స్ అని చెప్పి నరేష్ ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. కానీ ఆచితూచి అడుగు వేయాలని అనుకున్న నరేష్ తప్పని సరి పిరస్దితుల్లో మరో సినిమాకు ఓకే చెప్పాడట.

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ‘డిస్కో రాజా’ చిత్రంలో నరేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. తొలుత ఈ పాత్ర కోసం సునీల్‌ను ఎంపికచేసుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర నరేశ్‌కు దక్కినట్లు తెలుస్తోంది. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఓ సైఫై థ్రిల్లర్‌గా ఉండబోతోందని సమాచారం. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేశ్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.