‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ సినిమాలో అఖిల్ పాత్ర

‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ సినిమాలో అఖిల్ పాత్ర

కెరీర్ మొదట నుంచి ఒక్క హిట్టూ లేని అఖిల్ …చాలా డెస్పరేట్ గా ఉన్నారు. వరుసగా ‘అఖిల్’ మరియు ‘హలో’ సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఈ యువహీరో ‘మిస్టర్ మజ్ను’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా సైతం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. దాంతో దాదాపు ఏడు నెలల వెయిట్ చేసి మరీ కెమెరా ముందుకు వచ్చారు అఖిల్‌.

‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ సినిమా ఆరంభమైంది. మొదటి సినిమాతోనే నంది అవార్డ్ గెలుచుకున్న బొమ్మరిల్లు భాస్కర్ తన తర్వాత సినిమాలతో పెద్దగా మెప్పించలేకపోయాడు. ఆఖరి సారిగా తెలుగులో ‘ఒంగోలుగిత్త’ సినిమాకు దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు అఖిల్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ పతాకంపై నిర్మించటం ఒకటే సినిమాపై ఆసక్తిని పెంచే విషయం.

ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. సినిమాకు సంభందించిన కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు తీస్తున్నారు. అఖిల్ ఈ సినిమాలో అప్పర్ మిడిల్ క్లాస్ యువకుడుగా కనిపించనున్నారు. గీతా గోవిందం తరహాలో ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్. షూటింగ్ కోసం చాలా మంది పిల్లలను లొకేషన్ కు తీసుకు వచ్చారు. వాళ్లతో చాలా క్వాలిటీ టైమ్ గడిపారు అఖిల్.

జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్‌ పదిరోజులపాటు సాగుతుందట. నెక్ట్స్‌ ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసిందట టీమ్‌. ప్రస్తుతం హీరోపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు ఎంపికయ్యారు? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.