సునీల్ కెరీర్ కి బోయపాటి బూస్ట్

కమెడియన్‌గా కెరీర్ మొదలెట్టి హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఫెయిలైన సునీల్ మళ్లీ కమెడియన్, క్యారెక్టర్ రోల్స్‌వైపు దృష్టి పెట్టడం తెలిసిందే. రెండు పడవల జర్నీ విఫలమై వెనక్కి తిరిగి చూసేసరికి  అప్పటికే తన ప్లేస్‌ను చాలామంది కమెడియనే్ల ఆక్యుపై చేసేశారు. ముఖ్యంగా సునీల్ ప్లేస్‌ను తనదైన స్టైల్‌తో వెన్నెల  కిషోర్ ఆక్యుపై చేసేశాడనే చెప్పాలి. కెరీర్ పరుగు తప్పదు కనుక  ప్రాధాన్యతల్ని పక్కనపెట్టి వచ్చిన పాత్రల్ని చేసుకుంటూ వస్తున్నాడు సునీల్. దర్శకుడు త్రివిక్రమ్ స్నేహితుడిగా అరవింద సమేత.. అల వైకుంఠపురములో.. చాన్స్ దక్కినా గుర్తు పెట్టుకో తగినంత పాత్రలైతే దక్కలేదు. తాజాగా రవితేజ నుంచి వచ్చిన డిస్కోరాజాలో విలన్ రోల్ దక్కినా  సినిమా ఫలితం కలిసిరాలేదు. తాజాగా బోయపాటి  బాలయ్య కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలో సునీల్‌కు ఓ మంచి పాత్ర దక్కిందన్న కథనాలు వస్తున్నాయి. ప్రాజెక్టు చాన్స్ కన్ఫర్మ్ అయితే, సునీల్ కెరీర్‌కు బోయపాటి హెల్పవుతాడేమో చూడాలి