సందీప్ వంగా కు మహేష్ కండీషన్,అలా అయితే కష్టమే
మహేష్ బాబుతో సినిమా చేయాలనేది దర్శక,నిర్మాతల కల. రిలీజ్ కు ముందే ఓ రేంజిలో బిజినెస్ అవ్వటమే కాక మీడియాలో సైతం హాట్ టాపిక్ గా ఆయనతో పనిచేసే దర్శక,నిర్మాతలు నిలుస్తూంటారు. అయితే ఆ అదృష్టం అందరినీ వరించదు. కానీ ఆ లక్ దగ్గర దాకా వచ్చినా వద్దనుకునే వాళ్లు ఉన్నారా అంటే …దర్శకుడు సంగీప్ వంగా ని చూపిస్తున్నారు. ఆయన ఇప్పుడు మహేష్ తో సినిమా కన్నా బాలీవుడ్ లో మరో స్టార్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట.
కబీర్ సింగ్ చిత్రం సూపర్ హిట్ అయ్యాక ఈక్వేషన్స్ మారిపోయాయి. బాలీవుడ్ దర్శక,నిర్మాతలు పెద్ద పెద్ద ఆఫర్స్ తో సందీప్ ని కలుస్తోంది. అయితే తనకు కెరీర్ పరంగా బ్రేక్ ఇచ్చిన తెలుగు లో సినిమా చేద్దామా లేక, తనను జాతీయ స్దాయిలో నిలబెట్టిన హిందిలో సినిమా చేద్దామా అనే డైలమో ఉందిట. ఈ కన్ఫూజన్ కు బ్రేక్ ఇచ్చి బాలీవుడ్ లోనే బెస్ట్ అని నిర్ణయానికి వచ్చాడట.
వాస్తవానికి మహేష్ తో సినిమా అనుకుని కబీర్ సింగ్ తర్వాత స్క్రిప్ట్ రెడీ చేసారట. అయితే మహేష్ తో సినిమా అంటే ఆయనకు ఉండే ఫ్యామిలీ ఆడియన్స్ ని సంతృప్తి పరిచేలా ఉండాలి..అర్జున్ రెడ్డిలా హార్ష్ గా తీయటానికి ఉండదనే ఆలోచన ఉంది. మహేష్ కూడా ఇండైరక్ట్ గా అదే విషయం చెప్పారట. కథను తన ఆడియన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుని రాసుకోమన్నారట. దాంతో ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ప్రక్కన పెట్టి హిందీలోనే మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.