పోలీస్ మావ గా తెగ నవ్విస్తాడట

వెంకీ ఇవే బెస్ట్ అని ఫిక్స్ అయినట్లున్నాడు

ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు వెంకటేశ్‌. ఈ సినిమా దాదాపు పూర్తి కావొస్తున్న టైమ్ లో తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ‘వెంకీ మామ’రిలీజ్ తర్వాత వెంకీ చేయబోయే ప్రాజెక్టుపై ఓ క్లారిటీ వచ్చింది. ‘సినిమా చూపిస్త మామ’ ఫేమ్‌ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని తెలిసింది. ఈ సినిమాను నవంబర్‌లో సెట్స్‌ మీదకు తీసుకెళ్తారని సమాచారం. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తైందని, సురేష్ బాబు నేరేషన్ విన్నారని సమాచారం. పూర్తి కామెడీ సినిమా గా రూపొందబోతున్న ఈ చిత్రంలో వెంకటేష్ పోలీస్ గా కనిపించబోతున్నట్లు సమాచారం.

వెంకీ ఇప్పటిదాకా చేసిన పోలీస్ పాత్రలకు పూర్తి డిఫరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ కలిసిన ఈ కథ, కొద్దిపాటి యాక్షన్ తో ఉంటుందని వినికిడి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో జరిగే సీన్స్ ఫుల్ కామెడీ పండుతాయని ఇంటర్వెల్ దగ్గర వచ్చే చిన్న లాక్ , ఇప్పటిదాకా ఏ సినిమాలో రాలేదని, అది వినే వెంటనే వెంకీ డేట్స్ ఇచ్చారని చెప్తున్నారు. చిన్న పాయింట్ నే చాలా ఫన్నిగా మలిచారంటున్నారు.

నాన్‌స్టాప్‌ సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్‌ చేస్తోంది. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా రిలీజ్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. వెంకటేశ్‌ ప్రస్తుతం చేస్తున్న ‘వెంకీ మామ’ అక్టోబర్‌ నెలలో రిలీజ్‌ కానుంది. ఇందులో వెంకటేశ్, నాగచైతన్య మామా అల్లుళ్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.