నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ ఆ కొరియా సినిమా కాపీనా?

ద్యావుడా ‘గ్యాంగ్‌లీడర్‌’కూడా లేపిన కథేనా

నాని హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. ప్రియాంక మోహన్‌ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. కార్తికేయ విలన్ గా నటించారు. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ మంచి హిట్టైంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేమిటి అనేది అంతటా చర్చనీయాంసంగా మారింది. అదే సమయంలో ఈ సినిమా ఓ కొరియన్ సినిమా నుంచి లేపిన కామెడీతో తయారైందని చెప్తున్నారు.

ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నదాన్ని బట్టి Girl Scout అని 2008లో వచ్చిన ఓ చిత్రం స్టోరీలైన్ ని,కామెడీని తీసుకుని ఈ కథ తయారు చేసినట్లు చెప్తున్నారు. Girl Scout కథ ప్రకారం ఓ నలుగురు ఆడవాళ్లు కష్టపడి పోగుచేసుకున్న డబ్బుతో ఓ సూపర్ మార్కెట్ పెడదామనుకుంటారు. అయితే అనుకోని విధంగా ఆ డబ్బుని తీసుకుని ఒకరు జంప్ అయ్యిపోతారు. అక్కడ నుంచి వాళ్లు నలుగురు ఆ డబ్బు పట్టుకుని పారిపోయిన వ్యక్తిని ఎలా పట్టుకునేరనే పాయింట్ తో కథ జరుగుతుంది. అయితే తెలుగు నేటివిటిని అద్ది ఈ కథను సాన పట్టి స్క్రీన్ ప్లే రాసినట్లు సమాచారం. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అవ్వాల్సిందే.

ఇక గ్యాంగ్ లీడర్ కథ విషయానికి వస్తే..

ఈ సినిమాలో నాని ఓ నవలా రచయత. హాలీవుడ్‌ సినిమాల డివిడిలు చూసి కాపీ కథలతో పుస్తకాలు రాసేస్తూంటాడు. అతనికి రివేంజ్ కథలంటే తెగ ఇష్టం. అలాంటి కథలే రెగ్యులర్ గా రాస్తూండటంతో అవి హిట్ అయ్యి..అతను చాలా తెలివైన వాడు అనే పేరు వచ్చేస్తుంది. రివేంజ్ కు అతని దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయని జనం అనుకుంటూంటారు. ఈ క్రమంలో అతన్ని నమ్మి …హీరోయిన్ ప్రియా మోహన్ … రివెంజ్‌ కోసం చూస్తోన్న అయిదుగురు ఆడాళ్లు ని తీసుకువచ్చి సాయిం చేయమంటుంది. ఆమె దగ్గర చిన్నతనం కాకూడదని, తనకు ధైర్యం లేకపోయినా, ఆ తెలివి లేకపోయినా…తప్పనిసరి పరిస్దితుల్లో వారు రివేంజ్ తీర్చుకునేందుకు సహకరించేందుకు ఒప్పుకుంటాడు.

అలాగే పనిలో పనిగా తాను చేసే పనులనే నవలగా రాసేయాలని భావిస్తాడు. కానీ అతనికి రివేంజ్ తీర్చుకునే కనీస స్కిల్స్‌ కూడా లేకపోవడంతో పాటు ఈ ఆడాళ్లంతా కూడా శుద్ధ అమాయకులు కావటంతో ఇబ్బందులు పడతారు. గొప్పకోసం ఒప్పుకున్న ఈ పని.. ఒక పవర్‌ఫుల్‌ విలన్‌ని ఢోకొనాల్సిన పరిస్థితికు దారి తీస్తుంది. వాళ్లందరి కామన్ విలన్ ..కార్తికేయ అని, అతనో బైక్ రేసర్ అని, బ్యాంక్ ని ముంచేసాడని, ఆ బ్యాంక్ లోనే వాళ్లందరి డబ్బులు ఉన్నాయని అర్దమవుతుంది. దాంతో ఆ రైటర్‌ గ్యాంగ్‌లీడర్‌ గా మారి ఎలా సాయిం చేసాడనేది మిగతా కథ.