జగన్ అభిమానులు మహేష్ బాబుకి దెబ్బేసారా?

దాదాపు ఏడాది తర్వాత మహేష్ బాబు సినిమా రిలీజ్ అయ్యింది. ఒక మూడు నెలలు తర్వాత టాలీవుడ్లో భారీ అంచనాలతో విడుదలయిన ఒక పెద్ద సినిమా మహర్షి ! భరత్ అనే నేను అనే హిట్ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో టాలీవుడ్ భారీ నిర్మాతలైన అశ్వినీదత్, దిల్ రాజు మరియు ప్రసాద్ పొట్లూరి సంయుక్త నిర్మాణంలో వచ్చిన మహర్షి ఓవర్సీస్ మార్కెట్లో అంచనాలని అందుకోలేకపోయింది.

ఓవర్సీస్ మహేష్ స్ట్రాంగ్ ఏరియా. ఇప్పటివరకు మహేష్ కెరీర్లో తొమ్మిది సినిమాలు మిలియన్ డాలర్ మార్క్ దాటాయి. మహర్షి ఓవర్సీస్ భేరం 18 కోట్ల దగ్గర మొదలై 14 కోట్ల దగ్గర సెటిల్ అయ్యింది. ఇప్పటివరకు మహర్షి సినిమా దాదాపు 1 .25 మిలియన్ డాలర్లు అంటే 8 కోట్లు వసూళ్లు రాబట్టగలిగింది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ లాభాల్లోకి వెళ్లాలంటే ఇంకో 9 కోట్లు వరకు రాబట్టగలగాలి.

తొలి వారాంతం తర్వాత ఇంకో 9 కోట్లు రాబట్టాలి అంటే మాటలు కాదు. మహర్షి సినిమాకి మహేష్ టాప్ 5 ఓవర్సీస్ సినిమాలలో చోటు దక్కలేదు. దీనికి రెండు ప్రధాన కారణాలు వినిపిస్తున్నాయి.

ఒకటి గతం కంటే ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్లో ఆఫర్స్ చాల వరకు తగ్గిపోయాయి. అందువలన టికెట్ ధరలు గతం కంటే ఎక్కువ అవడంవల్ల మహర్షి సినిమాకే కాదు అన్ని సినిమాలకి గతం కంటే వసూళ్లు తగ్గాయి. సూపర్ హిట్ టాక్ వచ్చిన జెర్సీ సినిమా కూడా 2 మిలియన్ డాలర్లు చేరలేకపోయింది.

రెండో కారణం చాల ఆసక్తికరంగా వుంది. వైస్సార్సీపీ అభిమానాలు చాల వరకు మహర్షి సినిమాని చూడలేదని చెబుతున్నారు. దీనికి కారణం ఏంటంటే బాలకృష్ణ కథానాయకుడు సినిమా బాగుందని ట్వీట్ చేసిన మహేష్ బాబు యాత్ర సినిమా సమయంలో తన సహకారం అందించలేదని వైస్సార్ అభిమానులు బాగా హర్ట్ అయ్యారని అప్పుడే మహేష్ సినిమా చూడవద్దని సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారని దాని దెబ్బ కలెక్షన్స్ మీద కనిపిస్తుందని చెబుతున్నారు.

ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ , ఇక్కడా ముఖ్యమైన కారణం ఏంటంటే గత వారంలో చిన్న పిల్లలున్న చాల ఫామిలీస్ అవెంజర్స్ సినిమా చూడడం మహర్షికి డివైడ్ టాక్ రావడం వలనే కలెక్షన్స్ తగ్గాయి అనిపిస్తుంది.