ఉస్తాద్ నెక్స్‌ట్ ఎటాక్ ఏపీలో.!

ఓ చిన్న వీడియో ప్రోమో.. చాలా చాలా చిన్నది. ట్రైలరూ కాదూ, టీజరూ కాదూ, గ్లింప్స్ అని పేరు పెట్టారు. దాన్ని ఓ మినీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తరహాలో హంగామా చేసి విడుదల చేశారు. అది కూడా ఓ సినిమా ధియేటర్‌లో.

ఆ గ్లింప్స్‌కి వచ్చిన రెస్పాన్స్ మాటల్లో చెప్పలేనిది. సినిమా రిలీజ్‌కి చేసినంత హంగామా చేశారు అభిమానులు ఈ గ్లింప్స్‌కి. ఇదంతా ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి హైద్రాబాద్‌లో నడిచిన హంగామా. నెక్స్‌ట్ ఆంధ్ర ప్రదేశ్‌లో ప్లాన్ చేయబోతున్నారట.

బహుశా అది ఈ నెలాఖరులోనే వుండొచ్చని అనుకుంటున్నారు. లేదంటే కనుక జూన్ సెకండ్ వీక్‌లో వుండొచ్చునని తెలుస్తోంది. హైద్రాబాద్‌లోనే ఇంత హంగామా నడిచింది. ఇక ఆంధ్రాలో అదీ పొలిటికల్ హీట్ వున్న ఏపీలో ఇక ఆ ఇంపాక్ట్ ఇంకెంతలా వుండబోతుందో.

అసలు సంగతేంటంటే, ఏపీలో రిలీజ్ చేయబోయే గ్లింప్స్‌కి పొలిటికల్ టచ్ ఇస్తారట. ఇంకేముంది.! పర్‌ఫామెన్స్ బద్దలైపోద్ది.! జస్ట్ వారం రోజుల షూటింగ్‌లోనే ఇంత అవుట్ పుట్ తీసుకొచ్చాడు హరీష్ శంకర్. నిజంగా గ్రేట్.!