Ugram Movie Review: ‘ఉగ్రం’ మూవీ రివ్యూ & రేటింగ్?

(చిత్రం : ఉగ్రం, విడుదల : 5 మే-2023, రేటింగ్ : 3/5, నటీనటులు: ‘అల్లరి’ నరేష్, మిర్నా, శ్రీకాంత్ అయ్యంగార్, ఇంద్రజ, శత్రు తదితరులు. దర్శకత్వం : విజయ్ కనకమేడల, నిర్మాతలు: సాహు గారపాటి & హరీష్ పెద్ది, సంగీతం : శ్రీ చరణ్ పాకల, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ జె, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్)

టాలీవుడ్ లో కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పరచుకున్న నటుడు ‘అల్లరి’ నరేష్. అల్లరి నరేష్ చిత్రం అంటేనే హాయిగా నవ్వుకోవచ్చనే ధీమా ప్రేక్షకుల్లో ఉంటుంది. అదే ఉత్సాహంతో థియేటర్లలోకి అడుగుపెడతారు. అయితే గత కొంతకాలంగా అలాంటి ఈ కామెడీ హీరో తన రూటు మార్చి కొత్త పంథాలో.. అంటే కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గత చిత్రం ‘నాంది’తో అల్లరి నరేష్ తనని తాను కొత్తగా పరిచయం చేసుకున్న విషయం తెలిసిందే. ‘నాంది’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎంత మంచి స్పందన వచ్చిందో తెలిసిందే. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో అదే పంథాను కొనసాగిస్తూ ‘ఉగ్రం’ చిత్రాన్ని చేశాడు. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులకు ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ ని చూపించబోతున్నట్లు చాటారు మేకర్స్. అలా తాజాగా ‘ఉగ్రం’ రూపంలో బాక్సాఫీస్ ముందుకొచ్ఛాడు. ‘నాంది’ సినిమా అల్లరి నరేష్ కెరీర్‌లో ఒక వైవిధ్యమైన చిత్రంగా నిలిచింది. దర్శకుడు విజయ్ కనకమేడల తొలి ప్రయత్నంలోనే ఒక మంచి సినిమాను తెరకెక్కించడమే కాకుండా అల్లరి నరేష్‌లోని నటనా నైపుణ్యాన్ని పూర్తిస్థాయిలో వాడుకోగలిగారు. ‘నాంది’ సూపర్ హిట్ కావడంతో విజయ్‌తో మరో సినిమా చేయడానికి అల్లరి నరేష్ పూనుకున్నారు. ఈసారి ‘ఉగ్రం’ అనే యాక్షన్ థ్రిల్లర్‌ను ఎంపిక చేసుకున్నారు. పోస్టర్లు, ప్రచార కార్యక్రమాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ‘అల్లరి’ నరేష్ హీరోగా మిర్న హీరోయిన్ గా దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజే (5, మే-2023) విడుదలయింది. మరి ఈ ‘ఉగ్రం’ ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం…

కథ : శివ కుమార్ (అల్లరి నరేశ్) సీరియస్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. సిఐగా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తుంటాడు. తప్పిపోయిన తన భార్య (మిర్నా) మరియు తన కూతురు కోసం సీరియస్ గా ఎంతగానో వెతుకుతూ ఉంటాడు. అసలు సిఐ శివకుమార్ భార్య, కూతురు ఎలా తప్పిపోయారు?, అలాగే సిటీలో మిస్ అయిన వందలాదిమంది ప్రజలు ఏమైపోయారు?, ఈ మిస్సింగ్ కేసులు వెనక ఎవరున్నారు ?, చివరకు సిఐ శివ కుమార్ ఈ మిస్సింగ్ కేసులను ఎలా పరిష్కరించాడు? తన భార్య కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ : ఈ సినిమా ‘అల్లరి’ నరేష్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఎందుకంటే, సినిమా కథ మొత్తం అతడిచుట్టూనే తిరుగుతుంది. సీఐ శివకుమార్ గా అల్లరినరేష్ ఔట్ స్టాండింగ్ పర్ ఫార్మెన్స్ కనబరిచాడు. అల్లరి నరేష్ ఒక కామెడీ హీరో అనే ఫీలింగ్ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి కలగదు. అంతగా తనను తాను ట్రాన్స్ ఫర్మ్ చేసుకున్నాడు. ఇక, అతని భార్య పాత్రను పోషించిన మిర్నా తన పాత్రకు న్యాయం చేసింది. విజయ్ కనకమేడల దర్శకత్వ పనితనం బాగున్నా.. తీసుకున్న స్క్రిప్ట్ లో విషయం లేకపోవడం సినిమా ఫలితం కొంత దెబ్బతీసింది. . అసలు సినిమాలో చెప్పుకోవడానికి మంచి పాయింట్ ఉన్నా గానీ, మెయిన్ గా ఏ సీక్వెన్స్ ఆసక్తిగా సాగలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా భాగంవిషయం లేని సన్నివేశాలతో, వర్కౌట్ కాని విచారణ డ్రామాతో సాగితే , సెకెండ్ హాఫ్ సాగతీత సన్నివేశాలతో నీరసం తెప్పించింది. సినిమా మొదలైన పది నిముషాలకే ఈ సినిమా ఏ స్థాయి సినిమానే అర్థమయిపోతుంది. దీనికి తోడు అనవసరమైన సీన్స్ తో సినిమాని డైవర్ట్ చేశారు. కథ అవసరానికి మించిన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. అలాగే కథ పరంగా వచ్చే కొన్ని కీలక సీన్స్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అయితే సినిమాలో ప్రీ క్లైమాక్స్ లో హై యాక్షన్ సీన్స్ తో మంచి ఎమోషనల్ సీక్వెన్స్ రాసుకోవడం బాగుంది. ఒక సిన్సియర్ పోలీసాఫీసర్. ఎన్నో చిక్కుముడులు ఉన్న కేసులను ఇట్టే పరిష్కరిస్తుంటాడు.

హీరోయిన్ మిర్న మీనన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వీరికి ఒక పాప పుడుతుంది. వీరి జీవితం ఇలా హాయిగా సాగిపోతున్న తరుణంలో అల్లరి నరేష్ కుటుంబానికి యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్ లో మనోడి మెమోరీ పోతుంది. అంతేకాదు, భార్య,బిడ్డ కూడా కనిపించకుండా పోతారు. అల్లరోడి భార్య, బిడ్డ తరహాలోనే సిటీలో ఎంతోమంది కనిపించకుండా పోతారు. ఇలా కనిపించకుండా పోవడానికి సిటీలోని హ్యుమన్ ట్రాఫికింగ్ ముఠాయే కారణం..ఈ ముఠా ఆగడాలకు అల్లరి నరేష్ ఎలా చెక్ పెట్టాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనే ఆసక్తికరమైన కథనంతో చిత్రం ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సాగిందని చెప్పొచ్చు. సాధారణ ప్రజలు మిస్ అయితే.. పోలీసులు దైర్యాన్ని ఇస్తారు. కానీ, పోలీస్ భార్యపిల్లలే మిస్ అయితే.. ఇక వారి పరిస్థితి ఎలా ఉంటుంది ?, ఒక పోలీస్ ఫ్యామిలీ సమస్యలో ఉంటే.. తనను తన ఫ్యామిలీని అలాగే మిస్ అయిన మిగిలిన ప్రజలను ఆ పోలీస్ ఎలా సేవ్ చేసుకున్నాడు?, ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? అనే కోణంలో సాగిన ఈ ‘ఉగ్రం’ సినిమా కొన్ని సన్నివేశాల్లో విశేషంగా ఆకట్టుకుంటుంది. ‘ఉగ్రం’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ యాక్షన్ సీన్స్, మరియు క్లైమాక్స్ చాలా బాగున్నాయి. ఐతే, కథనంలో కొన్ని చోట్ల ఆకట్టుకునే కంటెంట్ లేకపోవడం, అలాగే ప్లే బోర్ గా సాగడం, కొన్ని సీక్వెన్స్ లో లాజిక్స్ లేకపోవడం వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ గా నిలిచాయి. అయితే.. తన పరిపక్వతమైన నటనతో అల్లరి నరేశ్ ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా అల్లరి నరేష్ తనదైన శైలిలో ఇరగదీశాడు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. అలాగే ప్రధాన పాత్రలో నటించిన శత్రు కూడా చాలా బాగా నటించాడు.

ఇక హీరోయిన్ గా నటించిన మిర్నా తన నటనతో ఎమోషనల్ సీన్స్ లో బాగానే నటించింది. మెయిన్ గా హీరో – ఇజ్రాల గెటప్స్ లో ఉన్న విలన్ల మధ్య వచ్చే సన్నివేశాలు పర్వాలేదు. మరో కీలక పాత్రలో నటించిన ఇంద్రజ కూడా సూపర్ గా నటించింది. శ్రీకాంత్ అయ్యంగార్ తో పాటు మిగిలిన నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్ మరియు వారి నటన ఫర్వాలేదు. తమతమ పాత్రల్లో ఒదిగిపోయారు. దర్శకుడు విజయ్ రాసుకున్న కథ బాగుంది. కథనాన్ని కూడా బాగానే నడిపించాడు. అయితే సినిమా ప్రారంభం కాస్త స్లోగా అనిపించినా…కథలోకి వెళ్లే కొద్దీ ప్రేక్షకుడిని ఎక్కడా బోర్ కొట్టించకుండా దర్శకుడు ముందుకుతీసుకెళ్లాడు. హీరో మిస్టరీని సాల్వ్ చేసే విధానం, కథలో వచ్చే ట్విస్టులు, ఇన్వెస్టిగేషన్ తీరు ప్రేక్షకుడిని మెప్పించే విధంగా ఉన్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమా స్థాయిని పెంచాయని చెప్పాలి. ఓవరాల్ గా ‘నాంది’ చిత్రంతో కమర్షియల్ సక్సెస్ ని ఖాతాలో వేసుకున్న అల్లరి నరేష్ తాజాగా తన ‘ఉగ్రం’తో కూడా మరో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి. మాస్ ఆడియెన్స్ తో పాటు థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమాని తప్పకుండా నచ్చుతుంది..ఎందుకంటే, నరేష్ ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియెన్స్ ని ఇస్తాడు. ‘అల్లరి’ నరేష్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు దాటిపోయింది. కెరీర్ ప్రారంభంలో వరుసగా కామెడీ సినిమాలు చేసుకుంటూ కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ‘అల్లరి’ నరేష్‌కు మధ్యమధ్యలో చేసిన సీరియస్ సినిమాలు నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’, ‘మహర్షి’ లాంటి సినిమాలు నరేష్‌కు సెపరేట్ ఇమేజ్‌ను క్రియేట్ చేశాయి. నరేష్ కూడా ఇలాంటి సినిమాలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలో 2021లో చేసిన ‘నాంది’ సినిమా అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ సినిమాలో నరేష్ కనిపించారు. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల చెప్పిన కథను నమ్మి నగ్నంగా కూడా నటించడానికి ఒప్పుకున్న అల్లరి నరేష్‌కు ఫలితం దక్కింది. ‘నాంది’ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో ఇదే దర్శకుడితో మరో సినిమా చేయడానికి నరేష్ అంగీకరించారు. అదే ‘ఉగ్రం’. దర్శకుడే కాదు.. ‘నాంది’ సినిమాకు పనిచేసిన టీమ్‌లో చాలా మంది ‘ఉగ్రం’ సినిమాకు పనిచేశారు. ‘నాంది’లో చేయని తప్పుకు శిక్ష అనుభవించే అమాయకుడిగా నరేష్‌ను చూపించిన విజయ్ కనకమేడల.. ‘ఉగ్రం’లో మాత్రం పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా ఆవిష్కరించారు. నరేష్‌ మునుపెన్నడూ చేయని యాక్షన్‌ సీక్వెన్స్‌లను ఈ సినిమాలో చేయించారు. దర్శకుడు విజయ్ రాసుకున్న కథ బాగున్నా.. కథనాన్ని ఆయన నడిపించిన తీరు కొంచెం ఇబ్బంది కలిగించింది. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతగా ఆకట్టుకోదు. చాలా నెమ్మదిగా సాగుతుంది. లవ్ ట్రాక్ వర్కౌట్ కాలేదు. సినిమా ప్రారంభమైన ఇరవై నిమిషాల తరవాత నుంచి ట్రాక్ ఎక్కుతుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగా ఆకట్టుకుంటుంది. అయితే, ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ అందరికీ నచ్చుతుంది. మిస్టరీని సాల్వ్ చేయడం, ట్విస్టులు, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ సెకండాఫ్‌లో ప్రేక్షకుడికి ఊరట కలిగిస్తాయి. . అయితే, ఇన్వెస్టిగేషన్‌లో కూడా కథనం కాస్త నెమ్మదిగా ఉండటంకొంత మైనస్ గానే అనిపించింది.

టెక్నీకల్ విషయాలకొస్తే.. : ముందుగా ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సిద్ధార్థ్ జె సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఒకే.. ఇక సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకల సమకూర్చిన నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాతలు సాహు గారపాటి & హరీష్ పెద్ది ఎక్కడారాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు స్థాయికి తగ్గట్టే ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమా యాక్షన్ డ్రామాలు ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.