తరుణ్ పరువు తీసిన ప్రియమణి 

Tarun is a disgraced by priyamani,
నటి రోజారమణి కుమారుడు తరుణ్ బాలనటుడిగా సినిమారంగంలోకి ప్రవేశించి వయసొచ్చిన తరువాత హీరోగా ఎదిగి లవర్ బాయ్ గా ఫేమస్ అయిన సంగతి అందరికి తెలుసు. తరుణ్ హీరోగా మొదట్లో నటించిన అనేక సినిమాలు మంచి హిట్స్ అయ్యాయి.  కన్నెపిల్లల కలల రాకుమారుడుగా పెద్ద ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.  అయితే ఎందుకనో ఆ తరువాత బాగా వెనుకబడి చాలాకాలంగా సినిమాలు లేకుండా ఖాళీగా ఉంటున్నాడు.  ఆయనతో కలిసి ఒక సినిమాలో హీరోయిన్ గా నటించారు ప్రియమణి. తరుణ్ ప్రస్తుతం నలభై ఏళ్ల వయసుకు చేరువలో ఉన్నాడు.  ఇంతవరకూ ఆయనకు వివాహం కాలేదు.  చాలా సంబంధాలు వచ్చాయట కానీ ఏదీ కుదరక ఇప్పటికీ బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు.
 
Tarun is a disgraced by priyamani,
Tarun is a disgraced by priyamani,
కొంతకాలం క్రితం ఆత్మహత్యకు పాల్పడిన అందాల నటి ఆర్తి అగర్వాల్, తరుణ్ ల మధ్యన ప్రేమాయణం నడిచిందని, అయితే తరుణ్ తల్లితండ్రులు వారి ప్రేమకు అంగీకరించకపోవడంతో ఒకసారి ఆర్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని పుకార్లు కూడా వినిపించాయి.  వాటిలో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ రోజారమణి ఆ వార్తలను ఖండించారు.     
 
అదలా ఉంచితే ప్రియమణి  మొన్న ఎన్టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక విశేషాన్ని పంచుకున్నారు.  తరుణ్ తో తాను “నవ వసంతం” అనే సినిమాలో నటించానని, ఆ సమయంలో తమ మధ్య ప్రేమ చిగురించినట్లు పుకార్లు రేగాయని, ఒకరోజు తాను షూటింగ్ లో ఉండగా తరుణ్ తల్లి స్పాట్ కు వచ్చి “మీ ఇద్దరి బంధాన్ని మేము ఆమోదిస్తున్నామని” చెప్పారని, దాంతో తాను షాక్ తిన్నట్లు చెప్పుకొచ్చారు.  అసలు తమ మధ్య అలాంటిదేమీ లేదని, అలాంటపుడు తరుణ్ తల్లి తమ ప్రేమను అంగీకరించామని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పడం సంచలనం కలిగించింది.  ఆ వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి ఈ విషయాన్నీ చెప్పానని వివరించారు ఆమె.  అంతేకాక తమిళనాడుకు చెందిన ఒక జర్నలిస్ట్ కూడా ఫోన్ చేసి తన ప్రేమాయణం గూర్చి పుకార్లు వెలువడుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారని చెప్పుకొచ్చారు.  
 
ఇక నలభై ఏళ్ళు దాటిన ముదురు బ్రహ్మచారులు కోవలోకి వెళ్లిన మరొక హీరో ప్రభాస్.  అందం, ఐశ్వర్యం, ప్రఖ్యాతి, గొప్ప కుటుంబ వారసత్వం, డిమాండ్ అన్నీ ఉన్నా ప్రభాస్ కు వివాహం మాత్రం ఇంకా కాకపోవడం ఆశ్చర్యమే.  ప్రభాస్ మీద ఎలాంటి గాసిప్పులూ లేవు. ప్రభాస్ సమకాలీనులైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ లాంటి హీరోలు పెళ్లిళ్లు చేసుకుని పిల్లల తండ్రులు కూడా అయ్యారు. మరి ప్రభాస్, తరుణ్ మధ్య వయసుకు చేరుతున్నా ఇంకా బ్రహ్మచారులుగా  ఎందుకు ఉండిపోయారో అంతుబట్టని విషయం.