రేటింగ్ : 1.5/5
రచన- దర్శకత్వం : డైమండ్ రత్నబాబు
తారాగణం : మోహన్ బాబు, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజారవీంద్ర తదితరులు
సంగీతం : ఇళయరాజా,
ఛాయాగ్రహణం : సర్వేష్ మురారి
బ్యానర్ : 24 ఫ్రేం ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
నిర్మాత : మంచు విష్ణు
విడుదల; ఫిబ్రవరి 18, 2022
***
Son of India Movie Review : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ బుకింగ్స్, ట్రోలింగ్స్ అంటూ ప్రధానాకర్షణగా నిలిచాక ఈ రోజు విడుదలైంది. మెగా స్టార్ చిరంజీవి వాయిసోవర్ తో విడుదలైన టీజర్ తో సినిమా పట్ల ఆసక్తి రేగింది. సినిమాకి డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకడుగా పరిచయమయ్యాడు. మోహన్ బాబు సొంత బ్యానర్ మీద మంచు విష్ణు నిర్మించాడు. దీన్ని ప్రయోగాత్మకంగా నిర్మించామన్నారు. మోహన్ బాబు లాంటి మాస్ హీరోతో ఏం ప్రయోగం చేశారు? ఎలా చేశారు? ఇది తెలుసుకుందాం…
కథ
కడియం బాబ్జీ (మోహన్ బాబు) ఓ డ్రైవర్. ఎన్ఐఏ అధికారిణి ఐరా (ప్రగ్యా జైస్వాల్) దగ్గర డ్రైవర్ గా వుంటాడు. ఏకాకి జీవితం గడుపుతూంటాడు. ఇలా వుండగా, కేంద్రమంత్రి మహేంద్ర భూపతి (శ్రీకాంత్) తిరుపతికి వెళ్లాల్సి వుండగా తలకోనలో కిడ్నాపవుతాడు. తర్వాత ఓ డాక్టర్, దేవాదాయ శాఖ ఛైర్మన్ ఇద్దరూ కిడ్నాప్ అవుతారు. కిడ్నాపర్స్ ని పట్టుకోవడానికి ఐరా రంగంలోకి దిగుతుంది. దర్యాప్తులో కిడ్నాప్స్ కి కారకుడు బాబ్జీయే అని తేలుతుంది. బాబ్జీ ఎందుకు కిడ్నాపులు చేశాడు? అతడి అసలు పేరు బాబ్జీ కూడా కాదు, విరూపాక్ష. ఈ విరూపాక్ష గతమేమిటి, ఏమిటతడి సమస్యనేది మిగతా కథ.
ఎలావుంది కథ
ఓ అన్యాయానికి గురైన వ్యక్తి ప్రతీకార కథ ఇది. దేశంలో ప్రైవేట్ పాఠశాలలు, బస్సులు, ఆస్పత్రులు వుండగా ప్రైవేట్ జైళ్ళు వుంటే తప్పేంటని ప్రశ్నించే బాధిత వ్యక్తి కథ. ‘భామాకలాపం’ లో లాగే చివరి వరకూ ఈ కాన్సెప్ట్ రివీల్ కాదు. ఆయా దృశ్యాలతో యాక్షన్- రివెంజీ కథంతా చూపించి, చివర్లో కథని సమప్ చేస్తూ ఈ ప్రైవేట్ జైళ్ళ పాయింటు చెప్తారు. కానీ జైళ్ళు న్యాయ వ్యవస్థ పరిధిలోనివి. ఇప్పుడు వివిధ పబ్లిక్ సెక్టార్స్ ని ప్రైవేటుకి అప్పజెప్పేస్తున్నట్టు, ఇక జైళ్ళూ పోలీస్ స్టేషన్లూ ప్రయివేటీకరణ చెందుతాయని భవిష్యవాణి చెప్తున్నారేమో. వర్కౌట్ కాలేదు.
నటనలు – సాంకేతికాలు
మోహన్ బాబు తాను ఏకపాత్రాభినయం చేశానని చెప్పినట్టు సినిమా అంతా ఆయనొక్కడే కన్పిస్తారు. ఇది ప్రయోగమే. అయితే ఈ ప్రయోగం తప్పనిసరై చేసినట్టున్నారు లాక్ డౌన్ సమయంలో షూటింగు వల్ల. ఇతర నటీనటుల్ని సమీకరించలేక, ఏకపాత్రాభినయం చేసేశారు. సినిమా నిదిని గంటా 40 నిమిషాలు ఇంకో ప్రయోగమే. అయితే ఈ నిడివికీ ఏకపాత్రాభినయం కూడా వర్కౌట్ కాలేదు సినిమాకి. నాటకానికి వర్కౌటయ్యే వ్యవహారం. ఈ ఏకపాత్రాభినయాన్ని నిలబెట్టాలంటే దీనికి తగ్గట్టు బలమైన కథా కథనాలూ, బలమైన పాత్ర, బలమైన సంభాషణలూ అవసరం. ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యాడు డైలాగ్ రైటరైన దర్శకుడు డైమండ్ రత్నబాబు. అనుభవజ్ఞుడైన మోహన్ బాబు అభినయబలం ముందు రచనా బలం చాల్లేదు.
దృశ్యాల్లో ఈత పాత్రలు కాన్పించవు. కేవలం మాటలు వింపోయిస్తాయి. కొన్ని చోట్ల దూప్స్ పెట్టడం వల్ల వాళ్ళ మొహాలు బ్లర్ చేసి వుంటాయి. ఇయాత్ర తారాగనమంతా చివరి దృశ్యంలోనే మనకి కాంపిస్తారు. లాక్ డౌన్ సమయంలో సింగిల్ కాల్షీట్ తో లాగించేసిన ఫలితమిడి.
ఇళయరాజా సంగీతంలో ఓ భక్తి పాత వుంది. ఇలాత్యరాజా సంగీతం లేదు. నేపథ్య సంగీతం సహా. భక్తి పాత గ్రాఫిక్స్ కి కోటీ 8 లక్షలు ఖర్చు పెట్టామన్నారు. క్వాలిటీ తీసికట్టుగా వుంది. కెమెరా వర్క్ కూడా బలహీనంగా వుంది. సాంకేతిక ప్రమాణాల్లేవు.
చివరికేమిటి
మోహన్ బాబు ఏక పాత్రాభినయంలో రెండు రకాల పాత్రలు. మొదట కారు డ్రైవర్ బాబ్జీగా, తర్వాత ప్రింటింగ్ ప్రెస్ విరూపాక్షగా. బాబ్జీ అసలెవరు అన్నప్పుడు, సెకండాఫ్ లో ఫ్యాక్షన్ సినిమాల టెంప్లెట్ లో విరూపాక్ష ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటున్న ఇతను ఓ చిన్న పొరపాటు వల్ల జైలు పాలవుతాడు. కుటుంబం నాశనమవుతుంది – భార్య (మీనా), కూతురూ సహా. ఇదంతా ఓ నాయకుడు (పోసాని కృష్ణమురళి) వల్ల జరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక, జైల్లోంచి వచ్చి వ్యవస్థ మీద పగదీర్చుకోవడం మొదలెడతాడు.
ఎప్పటిదో పాత టైపు కథ. దీనికి పొంతన లేని కథనం. వీటికి తగ్గట్టు పురాతన శైలి దర్శకత్వం. దీన్ని థియేటర్లో ప్రయోగం కోసం తీయలేదని తెలిసి పోతూంటుంది. ఓటీటీ కోసమే తీశారు. ఓటీటీలు ముందుకు రాకపోవడంతో తప్పనిసరై థియేటర్ రిలీజ్ చేశారు. చాలా సాహస ప్రయోగం. దేనికోసం? ఎవరి కోసం? ఏమో!
—సికిందర్