#Single Movie Review: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్..

చిత్రం: # సింగిల్
విడుదల: మే 09, 2025
రేటింగ్ : 2/5

నటీనటులు: శ్రీవిష్ణు, కేతికా శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను, కల్పలత తదితరులు.

దర్శకత్వం: కార్తీక్ రాజు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
నిర్మాతలు: విద్య కొప్పినీడి – భాను ప్రతాప – రియాజ్ చౌదరి
నిర్మాణం: విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి
సమర్పణ: అల్లు అరవింద్
సినిమాటోగ్రఫీ : ఆర్ వేల్ రాజ్
ఎడిటర్ : ప్రవీణ్ కె ఎల్

కామెడీతో పాటు కంటెంట్‌ని నమ్ముకుని సినిమాలు చేస్తూ అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు తాజాగా #సింగిల్‌ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా ప్రాచుర్యం పొందిన శ్రీవిష్ణు టైటిల్ రోల్ ప్లే చేసిన చిత్రమిది. “నిను వీడని నీడను నేనే”తో దర్శకుడిగా మెప్పించిన కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించగా.. ప్రమోషనల్ కంటెంట్ మంచి ఆసక్తి నెలకొల్పింది శ్రీవిష్ణు హీరోగా కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా రూపొందిన మూవీ ఇది. అల్లు అరవింద్‌ సమర్పణలో విద్యా కొప్పినీడు, భాను ప్రతాప్‌, రియాజ్‌ చౌదరీ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు. కామెడీ, ఫ్యామిలీ డ్రామాతో అలరించే ఈ యంగ్ హీరో ఈసారి కూడా అదే జోనర్ లో మరింత కామెడీ డోస్ పెంచి థియేటర్లలోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రం నేడు (మే 09, 20250 శుక్రవారం) విడుదలయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ: బ్యాంకులో ఉద్యోగాలు చేసే విజయ్ (శ్రీ విష్ణు), అరవింద్ (వెన్నెల కిషోర్) క్లోజ్ ఫ్రెండ్స్. స్కూల్ లైఫ్ నుంచి అమ్మాయిలకు ఎంతగా ప్రపోజ్ చేసినా ప్రయత్నాలు ఫలించవు. జీవితంలో లవర్స్, పార్ట్‌నర్స్ లేకుండా సింగిల్‌గానే గడుపుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో పూర్వ (కేతిక శర్మ) అనే అమ్మాయిని చూసి విజయ్ వెంటపడుతాడు. కానీ విజయ్‌ను ప్రేమించిన హరిణి ( ఇవానా) అతడి లవ్ కోసం వెంటపడుతుంది. బ్యాంకులో మంచి ఉద్యోగం, జీతం ఉన్నా ఎందుకో సింగిల్ గానే ఉండిపోయాడు విజయ్. ఆడి షోరూం లో సేల్స్ గర్ల్ గా వర్క్ చేసే పూర్వను ప్రేమిస్తాడు.

కానీ.. విజయ్ ను హరిణి ప్రేమిస్తుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎవరి ప్రేమ గెలిచింది? ఈ ప్రేమకథలో తలెత్తిన ఇబ్బందులు ఏమిటి? చివరికి విజయ్ సింగిల్ గా మిగిలిపోయాడా? లేక మింగిల్ అయ్యాడా? ఇదిలా ఉంటే.. గాయత్రి అనే అమ్మాయితో అరవింద్ కూడా ప్రేమలో పడుతాడు. పూర్వ, హరిణి మధ్య విజయ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? తన వెంట పడుతున్న విజయ్‌ ప్రపోజల్‌కు పూర్వ ఎలా రియాక్ట్ అయింది? తన వెనుక పడుతున్న హరిణితో విజయ్ ఎలాంటి రియాక్షన్ ఇచ్చాడు? ఈ ట్రాయాంగిల్ లవ్ గేమ్‌లో ఎవరి ప్రేమను విజయ్ దక్కించుకొన్నాడు? సింగిల్ ట్యాగ్ నుంచి విజయ్, అరవింద్ ఎవరితోనైనా మింగిల్ అయ్యారా? జీవితంలో ఒక్క అమ్మాయితోనైనా ప్రేమలో పడాలనే లక్ష్యాన్ని విజయ్, అరవింద్ చేధించారా? మరి వీరి ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది. విజయ్‌కి పూర్వ పడిందా? హరిణికి విజయ్‌ పడ్డాడా? లేక సింగిల్‌గానే మిగిలిపోయాడా? చివరకు ఈ ముగ్గురి మధ్య కథ ఎలా ముగిసింది ? అనే ప్రశ్నలకు ఫన్‌తో ఇచ్చిన సమాధానాలే ‘సింగిల్’ సినిమా కథ.

విశ్లేషణ: దర్శకుడు కార్తీక్ రాజు ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ చాలా ప్లాట్ పాయింట్స్ పెట్టి మంచి ఫన్ రాబట్టినప్పటికీ.. కొన్ని సన్నివేశాలను స్లోగా నడిపారు. మొయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగుతూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే, ఫస్ట్ హాఫ్ లో సినిమాలోని పాత్రలను పరిచయం చెయ్యడానికే కూడా దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. పైగా ఎక్కువగా కామెడీ సన్నివేశాల కోసం కథనాన్ని ల్యాగ్ చేయడం బాగాలేదు. హీరోయిన్స్ కేతిక శర్మ మరియు ఇవానా పాత్రలను ఇంకా బాగా బలంగా రాసుకోవాల్సింది. అలాగే, హీరో..హీరోయిన్ల మధ్య కాన్ ఫ్లిక్ట్ ను రైజ్ చేస్తూ స్క్రీన్ ప్లేను టైట్ చేసుకోవాల్సింది. ఇక సినిమాలో ఒక పాట కూడా గుర్తుండిపోయేలా లేదు. మొత్తానికి మ్యూజిక్ పరంగా ఈ చిత్రం పెద్దగా ఇంప్రెస్ చేయదు. అయితే ప్రేక్షకులు మాత్రం మనస్ఫూర్తిగా సినిమాలో చాలా సార్లు నవ్వుకుంటారు.

కానీ, బలమైన కథాకథనాలు ఉండి ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్లి ఉండేది. కథ-కథనంతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు ఎంజాయ్ చేస్తాం. వాటికి కూడా ప్రొపర్ జస్టిఫికేషన్ అవసరం. లేకపోతే ఆడియన్స్ దేనికి కనెక్ట్ అవ్వాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతారు. “సింగిల్” విషయంలోనూ అదే జరిగింది. లెక్కలేనన్ని సింగిల్ లైనర్స్, శ్రీవిష్ణు-వెన్నెల కిషోర్ కామెడీ హిలేరియస్ గా నవ్వించినా.. సినిమాగా మాత్రం పూర్తిస్థాయిలో ఈ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు కార్తీక్ రాజు కథను పెద్దగా పట్టించుకోలేదు. కేవలం శ్రీవిష్ణు టైమింగ్ తో సినిమాని నడిపించాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆరిజిన్ ఏమిటి? రియలైజేషన్ పాయింట్ ఏమిటి? క్లోజర్ ఏమిటి? అనేది ఎక్కడా పట్టించుకోలేదు. శ్రీవిష్ణు-వెన్నెల కిషోర్ పుణ్యమా అని సినిమా అలా వెళ్లిపోయింది. కథనం మీద కూడా కాస్త కాన్సంట్రేట్ చేసి ఉంటే బాగుండేది. ఎంత టైమ్ పాస్ సినిమా అయినా.. ఎమోషన్ లేదా క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వలేకపోతే ఎంజాయ్ చేయలేము.

ముఖ్యంగా సినిమాలో రాజేంద్రప్రసాద్ పాత్రను కేవలం జస్టిఫికేషన్ కోసం వాడుకోవడం, ముగింపు కూడా హీరోయిన్లను ఇరికించి ఎంటర్టైన్ చేసే ప్రయత్నమే తప్ప సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయాడు. ఓవరాల్ గా దర్శకుడిగా కార్తీక్ రాజు పూర్తిస్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయాడనే చెప్పాలి. యాష్‌ ట్యాగ్‌ సింగిల్‌ మూవీ కథ పరంగా చాలా సింపుల్‌. ఇదొక ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ. ఇద్దరు లవర్స్ తో హీరో ఎలా ఇబ్బంది పడ్డాడు? వారిని ఇంప్రెస్‌ చేయడానికి చేసే ప్రయత్నాలు ఈ క్రమంలో పుట్టే కామెడీనే ఈ చిత్రం. స్టోరీ సింపుల్‌గానే ఉండటంతో మెయిన్‌గా కామెడీనే నమ్ముకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సందర్భానుసారంగా పుట్టే కామెడీ బాగా వర్కౌట్‌ అవుతుంది. ఇటీవల వచ్చిన చాలా చిత్రాలు ఇలానే విజయాలు అందుకున్నాయి. ఆ కోవలోనే సింగిల్‌ మూవీని రూపొందించారు. లాజిక్‌తో సంబంధం లేకుండా ఆడియెన్స్ ని రెండున్నర గంటలపాటు నవ్విస్తే చాలు సినిమా థియేటర్లలో రచ్చ చేస్తుంటుంది. ఈ మూవీ విషయంలో అదే స్ట్రాటజీని ఇంప్లిమెంట్‌ చేశారు. కానీ అది అంతగా వర్కవుట్ కాలేక చతికిల పడ్డారు. సినిమా ప్రారంభం నుంచే కామెడీ వర్కౌట్‌ అయ్యే ప్రయత్నం చేశారు.

శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్‌ ల మధ్య కామెడీ ట్రాక్‌ని బలంగా రాసుకుని ఈ మూవీని తెరకెక్కించారు. అయితే. వీరిద్దరి మధ్య సీన్లు ఎప్పుడు వచ్చినా హిలేరియస్‌గా నవ్వులు పూయిస్తుంది. కానీ ఎందుకో ఈ సినిమాలో అంతగా నవ్వులు పూయించలేకపోయింది. ఇక అమ్మాయిల విషయంలో హీరో చేసే పొరపాట్లు, తొందరపాట్లు, ఈ క్రమంలో కొందరు అమ్మాయిలను దూరం చేసుకోవడం వంటి సీన్లు సిల్లీగా అనిపించాయి. హీరో పాత్రని కేవలం కామెడీగానే కాదు, అందులోనూ బాధ్యతని చూపించిన తీరు ప్రేక్షకులను అలరించలేకపోయింది. మంచితనం, బాధ్యత వంటి లక్షణాలు హీరోకి ఉంటేఇప్పుడు వర్కౌట్‌ కాదు, కానీ ఇందులో దాన్ని కన్విన్సింగ్‌గా చూపించడం విశేషం. హీరోహీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌ సీన్లు ట్రెండీగా ఉంటాయి. ఇప్పటి యువతకి బాగా కనెక్ట్ అవుతాయి. అవే సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు.

ఏ సినిమా అయినా కథ బలంగా లేకపోతే ఓ దశలో కొంత నిరాసక్తి అనిపిస్తుంది. ఇందులోనూ అలాంటి ఫీలింగ్‌ కలుగుతుంది. కొన్ని సీన్లు ఇరికించాయా? అనేలా ఉంటాయి. లాజిక్‌ లేకుండా ఉంటాయి. అయితే సెకండాఫ్‌లో కొంత ఎమోషనల్‌ టచ్‌, క్లైమాక్స్ లో స్టార్స్ గెస్ట్ అప్పీయరెన్స్ లు హైలైట్‌గా నిలిచాయి. క్లైమాక్స్ ని కొత్తగా చూపించిన తీరు కూడా బాగుంది. ఒక అమ్మాయి కోసం ఓ యువకుడు ప్రయత్నిస్తుంటే.. మరో అమ్మాయి ఆ యువకుడి వెంటపడటం అనే పాయింట్ చాలా రొటీన్, రెగ్యులర్ పాయింట్‌గానే కనిపిస్తుంది. కానీ దర్శకుడు కార్తీక్ రాజు ఈ పాయింట్‌కు ఇచ్చిన ట్రీట్‌మెంట్, రాసుకొన్న సన్నివేశాలు, అనుసరించిన స్క్రీన్ ప్లే ఈ సినిమాకు బలంగా నిలిచాయి. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ పాత్రల ద్వారా పండించిన వన్ లైనర్ డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ చాలా చోట్ల బ్రహ్మండంగా పేలాయి. సన్నివేశాలు అలా పరుగులు పెడుతుంటాయి. కానీ కథలో మాత్రం ఎలాంటి కదలిక లేకపోవడం కొంత టెస్టింగ్ టైమ్‌లానే ఉంటుంది. అయితే అలాంటి ఫీలింగ్ నుంచి సెకండాఫ్‌లో మూర్తి (రాజేంద్ర ప్రసాద్) క్యారెక్టర్‌ను తెరపైకి తెచ్చి ఎమోషనల్ కంటెంట్‌ను జొప్పించడంతో కథలో కొద్దిగా చలనం కనిపిస్తుంది. ఇక చివర్లో యంగ్ హీరో, హీరోయిన్ల గెస్ట్ అప్పీయరెన్స్‌తో స్టోరీలో జోష్ పుట్టించడం కొంత రిలీఫ్‌గా ఉంటుంది. చివరి 15 నిమిషాలు రొటీన్ ముగింపు లేకుండా డిఫరెంట్ టచ్‌తో ముగించడం సినిమాకు కొత్తదనాన్ని తీసుకొచ్చారని చెప్పవచ్చు.

నటీనటుల పనితీరు : ఇటీవల కాలంలో విభిన్న కథ, విలక్షణమైన పాత్రలతో విజయాలు సాధిస్తున్న శ్రీ విష్ణు మరోసారి డిఫరెంట్ క్యారెక్టర్‌లో చెలరేగిపోయాడు. తన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా రాసిన సన్నివేశాల్లో మస్తుగా ఫన్ క్రియేట్ చేశాడు. శ్రీ విష్ణుకు వెన్నెల కిషోర్ తోడవ్వడంతో మరింత కామెడీ పండింది. సినిమాలో ఈ ఇద్దరు పోటాపోటీగా పంచ్ డైలాగ్స్ వేస్తూ సీన్లను వినోదభరితంగా మార్చారు. ఇక కేతిక శర్మ, ఇవానాకు ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలు లభించడంతో వారు కూడా గ్లామర్‌తోపాటు యాక్టింగ్ కూడా బాగా చేశారు. కేతిక గ్లామర్‌తో ఆకట్టుకొంటే.. ఇవానా అదనంగా ఎమోషనల్‌గా ఆకట్టుకొన్నది. ఇక వీటీవీ గణేష్ కూడా తనదైన హాస్యాన్ని పండించాడు. రాజేంద్ర ప్రసాద్ మరోసారి భావోద్వేగమైన పాత్రలో గుర్తుండిపోయే పాత్రలో కనిపించారు.

టెక్నికల్ విషయాల్లోకి వెళితే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫి ప్లస్ పాయింట్స్. విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ కామెడీ సీన్లకు చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరింది. వెల్ రాజ్ చిత్రీకరించిన సీన్లు, వాటికి వాడుకొన్న కలర్ ప్యాటర్న్ కారణంగా సన్నివేశాలు బ్యూటిఫుల్‌గా కనిపించాయి. ప్రవీణ్ ఎడిటింగ్, ఆర్ట్స్ వర్క్ విభాగాల పనితీరు బాగున్నాయి. విద్యా కొప్పినీడు, భాను ప్రతాప్, రియాజ్ చౌదరీ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా సింగిల్ గురించి చెప్పాలంటే.. ఫుల్లుగా కామెడీ, కొంత ఎమోషనల్‌గా సాగే ట్రాయంగిల్ లవ్ స్టోరి. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ చేసిన ఫన్ హంగామా, ఇవానా, కేతిక శర్మ గ్లామర్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అయినప్పటికీ .. కథ లేకుండా కామెడీ, స్క్రీన్ ప్లే పైనే ఆధారపడటం మైనస్‌గా అనిపిస్తాయి. థియేటర్‌లో కూర్చొనంత సేపు సరదా, కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు ఉంటాయి. బయటకు వచ్చాక చెప్పుకోవడానికి గొప్పగా ఏ అంశాలు ఉండవు.

రేటింగ్ : 2/5

మసూద్ హజాహార్ బిగ్ ప్లాన్  | Masood Azhar Revange Plan On PM Modi ? | Ind vs Pak War | Telugu Rajyam