‘రంగస్థలం’ కాంబో.! చిట్టిబాబుతో రామలక్ష్మి ఇంకోస్సారి.!

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమా సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టిన సినిమా ఇది.

ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు రామ్ చరణ్, సమంత. అంతకు ముందు కానీ, ఆ తర్వాత కానీ వీరి కాంబో సెట్ కాలేదింతవరకూ.

అయితే, ఈ కాంబో మళ్లీ రిపీట్ కానున్నట్లు ఓ సీక్రెట్ గాచిప్ చక్కర్లు కొడుతోంది. త్వరలో బుచ్చిబాబు సన (ఉప్పెన డైరెక్టర్) తో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ హీరోయిన్‌గా రష్మిక మండన్నాని అనుకుంటున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్దే పేరు కూడా పరిశీలనలో వుంది.

అయితే, సమంత పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. సమంత ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ వినబడుతోంది.

పాత్ర నిడివి చాలా తక్కువే అట. కానీ, ఓ పవర్‌ఫుల్ రోల్‌లో సమంత కనిపించనుందనీ తెలుస్తోంది. ఆల్రెడీ బుచ్చిబాబు సన, సమంత వద్దకు ఈ ప్రపోజల్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సమంత కూడా సుముఖంగానే వుందట.