మరో మల్టీస్టారర్‌కి ‘జై’ కొట్టిన రవితేజ.! బేరం భలేగుందే.!

మాస్ మహరాజ్ రవితేజని ‘డబ్బు మనిషి’గా అభివర్ణిస్తారు సినీ పరిశ్రమలో చాలామంది. ‘అబ్బే, నేనలాంటోడ్ని కాను’ అని కవరింగ్ చేసుకోవడానికి రవితేజ, పరోక్షంగా చాలా ప్రయత్నాలే చేస్తుంటాడనుకోండి.. అది వేరే సంగతి.

తాజాగా, ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కోసం చాలా గట్టిగా డిమాండ్ చేసిన రవితేజ, తాను అనుకున్నది సాధించాడు కూడా.! హీరోగా సినిమాలు చేయడం ఓ వైపు, గెస్ట్ రోల్స్ ఇంకో వైపు.. మల్టీస్టారర్ ట్రెండ్ భలే కలిసొచ్చింది.. అనుకుంటున్నాడట రవితేజ ఇప్పుడు. తాజాగా, మరో మల్టీస్టారర్‌కి రవితేజ ఓకే చెప్పాడంటూ టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

‘వాల్తేరు వీరయ్య’ తరహాలోనే రెమ్యునరేషన్ కూడా ఖరారైపోయిందట. నిడివి కూడా ఇంచుమించు అంతే వుంటుందని సమాచారం. ఈసారి ఓ యంగ్ హీరో సినిమాలో రవితేజ స్పెషల్ రోల్‌లో కనిపిస్తాడట. ఫుల్ డిటెయిల్స్ కొద్ది రోజుల్లోనే బయటకు రావొచ్చు.