బిగ్‌బాస్ ‘ఏడు’ కోసం దగ్గుబాటి రానా.?

బిగ్‌బాస్ ఏడో సీజన్ ఈ సారి సమ్‌థింగ్ స్పెషల్‌గా ప్రచారంలోకి వచ్చింది. ఇంతవరకూ కంటెస్టెంట్ల పేర్లే ఎక్కువగా ప్రచారంలో వుండేవి. కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో బిగ్‌బాస్ నిర్వాహకులు కిందా మీదా పడుతుండేవారు.

కానీ, ఈ సారి కంటెస్టెంట్ల లిస్టు ఇంకా సోదిలోకి రాకముందే, హోస్ట్ ఎంపిక ఎక్కువ చర్చలో నిలిచింది. ఏడో సీజన్ కోసం నాగార్జున అనుకూలంగా లేడన్నది ఈ చర్చ ఇంత హాట్ అవ్వడానికి రీజన్.

నాగ్ కాకుంటే బిగ్‌బాస్ హోస్ట్‌గా మరెవ్వరు.? అనే కోణంలో బాలయ్య పేరు ఇంతవరకూ వినిపించింది. అయితే, తాజాగా మరో పేరు వినిపిస్తోంది. అదే దగ్గుబాటి రానా.

రానా పేరు దాదాపు ఫైనల్ అయ్యిందనీ ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. నాగార్జున కంటే కూసింత ఎక్కువే రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడట రానా.

రానాకీ హోస్టింగ్‌లో బాగానే అనుభవం వుంది. పలు ఈవెంట్లలో హోస్టింగ్ చేశాడు రానా. అలాగే, రానా హోస్టింగ్‌లో ‘నెంబర్ వన్ యారీ’ వంటి టాక్ షోలు కూడా గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. సో, ఆ అనుభవాలన్నింటినీ రంగరించి ఇప్పుడు బిగ్‌బాస్‌ని రానా ఎలా హ్యాండిల్ చేయగలడో చూడాలి మరి.