మెగాఫ్యామిలీపై కొత్త‌ప‌లుకు `కుల‌`క‌ల‌క‌లం!

Chiranjeevi with YS Jagan

కొత్త ప‌లుకు కాల‌మ్ తో వేమూరి రాధాకృష్ణ ఎలాంటి దాష్టికాల‌కు ఒడిగ‌డుతున్నాడో తెలిసిందే. త‌న సామాజిక వ‌ర్గానికే కొమ్ముకాసే క‌థ‌నాలు ప్ర‌చురిస్తూ…చంద్ర‌బాబు నాయుడుకు బాకా కొడుతూ ప‌బ్బం గ‌డుపుకునే ఛాన‌ల్ …ప‌త్రిక ఆ ర‌కంగా ముందుకు సాగిపోతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు ఓడిపోయే స‌రికి ఆ పైశాచ‌క‌త్వం మ‌రీ పెట్రేగిపోతుంది. అటు ప‌త్రిక‌, ఛాన‌ల్, వెబ్ మీడియాల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఇష్టాను సారం క‌థ‌నాలు వేసి మాన‌సిక ఆనందాన్ని పొందుతున్న ఉదంతం గురించి తెలిసిందే. జ‌గ‌న్ ఏడాది పాల‌పై వేమూరి విశ్లేష‌ణ‌లు ఎంత దాష్టికంగా ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇదంతా రాజ‌కీయాంలో ఓ కోణం అని వ‌దిలేయోచ్చు. కానీ వేమూరి కుల పిచ్చి ఏ స్థాయిలో ఉందో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. ఈసారి ఏకంగా మెగా ఫ్యామిలీనే కొత్త ప‌లుకులో టార్గెట్ చేసి విమ‌ర్శించారు. ఇటీవ‌లే చిరంజీవి, నాగార్జున స‌హా ప‌లువురు పెద్ద‌లు సీఎం జ‌గ‌న్ ని క‌లిసిన సంగ‌తి తెలిసిందే . క‌రోనా తో జ‌నాలు అల్లాడుతుంటే..వీళ్లంతా భూములు…స్టూడియోల అభివృద్ది కోసం ఎగ‌డ‌బ‌డుతున్నార‌ని, రాజ‌ధాని రైతుల్ని ప‌ట్టించుకోలేద‌ని కొత్త ప‌లుకు ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేసాడు. ఇది జ‌గ‌న్ పై ఉన్న క‌క్ష‌తో అనుకున్నా…చిరంజీవిని వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసి మ‌రో ప‌లుకు వ‌దిలాడు. థియేట‌ర్లు మూసేసారు.

ఇక‌పై సినిమా అనేది ఓటీటీకే ప‌రిమితం. కాబ‌ట్టి ప్లాస్టిక్ స‌ర్జీరీ హీరోలు ఇక రాణించ‌లేక‌పోవ‌చ్చు అని కొత్త ప‌లుకులో ఊదాడు. ఇండ‌స్ర్టీలో ప్లాస్టిక్ స‌ర్జ‌రీ హీరోలంటే మెగా ఫ్యామిలీని ఉద్దేశించిన‌ట్లే. ఎందుకంటే ఆ ఫ్యామిలీ హీరోలే ప్లాస్టిక్ స‌ర్జరీలు చేయించు కున్నార‌న్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌యం. ఈ కొత్త ప‌లుకుపై మెగా అభిమానులు కూడా నిప్పులు చెరిగారు. బాల‌య్య‌పై ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు గ్రూప్ రాజ‌కీయాలు, కుల రాజ‌కీయాలు చేస్తున్నారు అన్న ప్ర‌చారం కార‌ణంగా..ఇలా రాధాకృష్ణ మెగా ఫ్యామిలీపై దాడికి య‌త్నించాడ‌ని అభిమానులు మండిప‌డుతున్నారు.

ఇలాంటి క‌థ‌నాలు వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌లో త‌మ కూలాన్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం అనుకోవ‌చ్చా? రాదాకృష్ణ అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఎందుకంటే బాల‌య్య‌…రాధాకృష్ణ ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కాబ‌ట్టే! అనే అంటున్నారు. ఈ కొత్త ప‌లుకు ప‌రిశ్ర‌మ‌లో `కుల` క‌ల‌క‌లం రేపే అవ‌కాశం లేక‌పోలేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స‌హ‌జంగానే ప‌రిశ్ర‌మ‌లో బ‌య‌ట‌కి క‌నిపించ‌ని కుల‌పిచ్చి ఉంద‌న్న మాట వాస్త‌వం. ప‌రిశ్ర‌మ‌లో ఆ రెండు సామాజిక వ‌ర్గాల‌ మ‌ధ్య ఎప్పుడూ అధిప‌త్య‌పోరు అంత‌ర్లీనంగా న‌డుస్తుంటుంది. తాజాగా కొత్త ప‌లుకుతో మ‌రింత ఆజ్యం పోసిన‌ట్లు అవుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.