బెస్ట్ ఫ్రెండ్ రవితేజ కోసం నయనతార వస్తుందా.?

సౌత్ క్వీన్‌గా చెప్పబడే నయనతారను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరని అడగ్గా.. తడుముకోకుండా రవితేజ పేరు ఠక్కున చెప్పేసింది నయనతార.

అందరూ షాకయ్యారు నయన్ సమాధానానికి. గతంలో రవితేజతో కలిసి ‘దుబాయ్ శీను’, ‘ఆంజనేయులు’ సినిమాల్లో నయనతార నటించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రవితేజ చేతిలో చాలానే కొత్త ప్రాజెక్టులున్నాయ్. మరికొన్ని చర్చల దశలోనూ వున్నాయ్. ఈ మధ్య రవితేజ తన సినిమాల కోసం యంగ్ హీరోయిన్లను ఎంగేజ్ చేయడం చూస్తున్నాం. ఆ క్రమంలో కొన్ని ట్రోల్స్ కూడా ఎదుర్కొంటున్నాడు మాస్ రాజా.

అయితే, ఈ సారి తన కొత్త సినిమా కోసం నయనతారను దించబోతున్నాడనీ ఇండస్ట్రీ టాక్. చాలా కాలం తర్వాత నయన్‌తో తన జోడీని రిపీట్ చేయాలనుకుంటున్నాడట మాస్ రాజా.

ఆ దిశగా ఆల్రెడీ నయన తారతో సంప్రదింపులు కూడా చేస్తున్నాడనీ తెలుస్తోంది. మరి, తన బెస్ట్ ఫ్రెండ్ రవితేజ కోసం నయన్ డేట్లు కేటాయిస్తుందా.? చూడాలి మరి.

రీసెంట్‌గా నయన తార ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.