టిఆర్ఎస్ కవితకు హీరో మహేష్ బాబు మద్దతు (వీడియో)

నిజామాబాద్ ఎంపీ , సీఎం కూతురు కల్వకుంట్ల కవిత చేపట్టిన సిస్టర్ ఫర్ చేంజ్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సిస్టర్స్ ఫర్ చేంజ్ కు మద్దతు తెలిపారు. మహేష్ తన మద్దతు తెలుపుతూ ఓ వీడియోను రూపొందించారు. దానిని ఎంపీ కవిత తన ట్వీట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

“ దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 28 మంది హెల్మెట్ పెట్టుకోక పోవడం వల్లనే చనిపోతున్నారు. 28 కుటుంబాలు వాళ్లు ప్రేమించే మనుషులను కోల్పోతున్నాయి. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల జీవితమే ఆగమైపోతది.  రాఖీ పండుగ సందర్భంగా అన్నదమ్ములకు రాఖీతోపాటు హెల్మెట్ బహుమతిగా ఇవ్వండి. వాళ్లను తప్పకుండా పెట్టుకోమని చెప్పండి” అంటూ మహేష్ ఆ వీడియోలో చెప్పారు. మహేష్ తన పుట్టిన రోజు నాడు సిస్టర్ ఫర్ ఏ చేంజ్ కార్యక్రమానికి మద్దతు తెలుపడంతో కవిత మహేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. మహేష్ బాబు వీడియో కింద ఉంది మీరు కూడా చూడండి. ట్వీట్టర్. కామ్ పై ప్రెస్ చేస్తే మహేష్ బాబు వీడియో వస్తుంది.

<

/p>