గతంలో లాగ నిర్మాత ఏమి అనుకుంటే అది జరిగే పరిస్దితి లేదు. హీరో ఎలా చెప్తే అలా నిర్మాత, దర్శకుడు వినాల్సిందే. లేకపోతే ఆ ప్రాజెక్టు ఉండదు. ఆ విషయం పెద్ద హీరోలతో సినిమా చేసిన వాళ్లందరికీ తెలుసు. దానికి తోడు పెద్ద హీరోలు తమ సొంత బ్యానర్స్ పెట్టుకుంటున్నారు. తమ దగ్గరకు వచ్చే నిర్మాతలను తమతో సినిమా చేయాలంటే తమ బ్యానర్ తో టై అప్ పెట్టుకోమని క్లియర్ గా చెప్తున్నారు.
రీసెంట్ గా అల్లు అర్జున్ అదే పని చేసారు. త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమా కోసం హారిక హాసిని బ్యానర్‌లో చేయడానికే ఓకే చేసాడు. అయితే ఓ కండీషన్ పెట్టారు. అది తమ తండ్రి బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ కూడా పార్టనర్ షిప్ గా ఉంటుందని అన్నాడు. మొదట్లో దీనికి ఓకే చేయకపోయినా కానీ అల్లు అర్జున్ డేట్స్ కావాలంటే త్రివిక్రమ్ వేరే ఆప్షన్ లేక హారిక హాసిని సంస్థ అధినేత రాధాకృష్ణని కూడా కన్విన్స్ చేసాడు. అదే సిట్యువేషన్ ని మహేష్ బాబుకూడా రిపీట్ చేస్తున్నారు.
గీత గోవిందం దర్శకుడు పరశురామ్‌తో అల్లు అరవింద్‌కి మరో చిత్రానికి ఎగ్రిమెంట్ వుంది. పరశురామ్ తన కొత్త కథని మహేష్‌కి చెప్పి అతడినుంచి ఓకే చేయించుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కాలంటే తన సంస్థ జిఎంబి ప్రొడక్షన్స్ కి నిర్మాణ భాగస్వామ్యం కావాలని మహేష్ కండీషన్ పెట్టారట. అక్కడ తన కొడుకు అల్లు అర్జున్ చేసిన పనే ఇక్కడ మహేష్ చేసేసరికి అల్లు అరవింద్ కు నోట మాట రాలేదట.