ఈగ విలన్ ప్రైవేటు వీడియోలు పబ్లిక్ లో పెడతారంట!

రాబోయే రోజుల్లో తెలంగాణ ఎన్నికల్లో జెండాపాతాలనే ఆశలు సజీవంగా ఉండాలంటే… కర్ణాటకలో కచ్చితంగా గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది బీజేపీ. దీంతో… అవకాశం ఉన్న మేర అన్ని శక్తులనూ వాడటానికి.. అందుబాటులో ఉన్న సర్వశక్తులూ ఒడ్డుతుంది. ఇందులో భాగంగా.. కన్నడ స్టార్ హీరోలపై దృష్టి సారించింది కాషాయదళం. ఫలితంగా… కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ను పార్టీలో చేర్చుకోవాలని ఫిక్సయ్యింది. అయితే… ఈ సమయంలో సుదీప్ కి ఒక బెదిరింపు లేఖ వచ్చిందంట. ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్!

కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ బీజేపీ లో చేరేందుకు రెడీ అయ్యారు. ఇవాళ బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఇతర పార్టీ పెద్దల సమక్షంలో కిచ్చా సుదీప్ బీజేపీలో చేరనున్నారు. ఈ సమయంలో సుదీప్ తో పాటు మరో స్టార్ హీరో… దర్శన్ తూగుదీప కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని అటు సుదీప్ – ఇటు బీజేపీలు ఇప్పటికే ధ్రువీకరించాయి. ఈ సమయంలో… బీజేపీలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ… కిచ్చా సుదీప్ కు రెండు బెదిరింపు లేఖలు రావడం సంచలనంగా మారింది.

సుదీప్ బీజేపీలో చేరడం ఇష్టం లేనివారు ఈ పనిచేశారా.. లేక, మరెవరైనా చేశారా అన్నది తెలియదు కానీ… ఆ లేఖలో… సుదీప్ కు సంబంధించిన ప్రైవేటు వీడియోలు పబ్లిక్ చేస్తామని బెదిరిస్తూ… అసభ్య పదాలతో కూడిన వార్నింగ్ ఉందంట! దీనిపై హీరో సుదీప్ మేనేజర్ జాక్ మంజు.. బెంగళూరులోని పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ చేపట్టారు.

అయితే… కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన వేళ.. అన్ని పార్టీలు ఓట్లు సీట్ల కోసం ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా బీజేపీ.. సినీ స్టార్స్ పై దృష్టి సారించింది. దీంతో… కర్ణాటకలో బలమైన నాయక సామాజికవర్గానికి చెందిన సుదీప్ పై బీజేపీ పెద్దల దృష్టి పడింది. దీంతో… సుదీప్ తో చర్చలు జరిపిన బీజేపీ పెద్దల ప్రయత్నం సక్సెస్ అయ్యింది. ఫలితంగా… కాషాయ కండువా కప్పుకోవడానికి సుదీప్ అంగీకరించారు.

కర్ణాటకలో షెడ్యూల్ కులాల కిందకు వచ్చే బలమైన నాయక సామాజికవర్గం.. కళ్యాణ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉంది. దీనివల్ల ఆ వర్గం ఓటు బ్యాంకుతోపాటు సుదీప్ ఫాలోయింగ్ కూడా తమకు కలిసి వస్తుందని బీజేపీ ఆశలు పెట్టుకుంది.

కాగా… దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “ఈగ” సినిమాతో సుదీప్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “బాహుబలి”, “సైరా”లలోనూ చిన్నపాత్రలు పోషించారు. కన్నడలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సుదీప్ కు అక్కడ భారీసంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది!